మెగాస్టార్ కోసం కొరటాల శివ న్యూ ప్లాన్.. రామ్ చరణ్ ఒప్పుకునేలా లేడు
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా సెట్స్ పైకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ సినిమా షూటింగ్ సగమే పూర్తయ్యింది. కరోనా లాక్ డౌన్ దెబ్బ కొరటలకు చా చిరాకు తెప్పిస్తోందట. ఎందుకంటే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే కమిట్మెంట్ ప్రకారం మరో రెండు సినిమాలని సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. అలాగే సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి తన శిష్యులకు అవకాశాలను ఇవ్వాలని అనుకున్నాడు.
కానీ కొరటాల ఆలోచించింది ఒకటైతే జరిగింది మరొకటి. ఇక కొందరు కరోనా వైరస్ సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేసుకుంటుండడంతో అదే తరహాలో వర్క్ చేయాలని ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ముందుగా టెస్ట్ షూట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని ముందుగా అయితే కొరటాల మెగాస్టార్ తో అవసరం లేని కొన్ని సన్నివేశాలను షూట్ చేయాలని అనుకుంటున్నాడట.

ఆ ప్లాన్ గనక వర్కౌట్ అయితే వెంటనే మెగాస్టార్ చిరంజీవిని షూటింగ్ లొకేషన్స్ కి రప్పించాలని చూస్తున్నారు. అయితే నిర్మాతగా ఉన్న రామ్ చరణ్ మాత్రం మొదటి నుంచి కూడా అందుకోసం ఒప్పుకోవడం లేదు. కరోనా తగ్గిన తరువాతే షూటింగ్ స్టార్ట్ చేయాలని 65ఏళ్ల వయసు గల తన తండ్రితో రిస్క్ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ముందుగానే దర్శకుడికి ఒక వివరణ ఇచ్చాడట. మరి ఇప్పుడు కొరటాల వేసిన కొత్త ప్లాన్ కి మెగాస్టార్ ఒప్పుకున్నా చరణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











