Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొరటాల శివ నెక్స్ట్ సినిమా వివరాలు, ఆయన మాటల్లోనే!
ప్రిన్స్ మహేష్‌బాబు తాజా చిత్రం భరత్ అనే నేను. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రిలీజై వారం దాటినా ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాకు ఎక్కువగా రావడంతో వసూళ్ళు పెరుగుతున్నాయి. సినిమా చూసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మూవీపై తమ స్పందన తెలియజేసారు.
ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాల్లో సోషల్ మెసేజ్ ను ప్రధానంగా చెప్పిన కొరటాల ఈసారి చేయబోయే సినిమా మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ కథాంశం ను ఎంచుకున్నట్లు తెలిపాడు. తన గత సినిమాల్లో మాదిరి ఎక్కువ సందేశం లేకుండా కొద్దివరకు సోషల్ పాయింట్‌ను టచ్ చేస్తానని తెలిపాడు.
సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లే ఏర్పాట్లలో ఉన్ననని కొరటాల తెలిపాడు. త్వరలో కొత్త సినిమాకు సంభందించిన పనులు ప్రారంభిస్తానని తెలిపాడు. అయతే తన నెక్స్ట్ సినిమాలో నటించే హీరో ఎవరనే విషయంపై క్లారిటి లేదు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.