‘మిర్చి’ దర్శకుడి నెక్ట్స్ మూవీ గబ్బర్ సింగ్ గణేష్‌తో...
ఈ విషయమై బండ్ల గణేష్ మాట్లాడుతూ... 'ఒక ప్రముఖ కథానాయకుడితో కొరటాల శివ దర్శకత్వంలో మా బేనర్లో ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి బండ్ల శివబాబు సమర్పకులుగా వ్యవహరించనున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమా వివరాల్లోకి వెళితే...ఈ రోజు విడుదలైన 'మిర్చి' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా అని చెప్పి... మళ్లీ పాత ఫ్యాక్షన్ స్టోరీని మిర్చి చిత్రంలో దర్శకుడు చూపెట్టాడని, సినిమా ఇది వరకు వచ్చిన పలు తెలుగు సినిమాల కిచిడీగా పేర్కొంటున్నారు సినీ పండితులు.
ఒక బండ్ల గణేష్ విషయానికొస్తే... ప్రస్తుతం బండ్ల గణేస్ జూ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తున్నారు. అదే విధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రం కూడా నిర్మిస్తున్నారు. త్వరలో గణేష్ మహేష్ బాబుతో 'టపోరి' అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications












