అగ్నికి వాయువు తోడైనట్లే..ఫైట్స్ కోసం మహేష్ భీకర ప్లానింగ్!
మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఉత్కంఠ భరితమైన పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ హీరో ఫీచర్స్ ఉండే మహేష్ బాబు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి పాత్రలో ఎలా కనిపిస్తాడో అని అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. భరత్ అనే నేను చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సాధారణంగా కొరటాల చిత్రాల్లో గ్రాఫిక్స్ అవసరమైన మేరకు మాత్రమే ఉంటాయి. అది కూడా యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమే.

భరత్ అనే నేను చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ని కొరటాల భారీగా ప్లాన్ చేసాడట. ఆ సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీన్స్ కు గ్రాఫిక్స్ జోడించి మెప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ మునుపటి చిత్రాలకంటే ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోయిన సంగతి తెలిసిందే. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 20 భరత్ అనే నేను చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











