రామ్ చరణ్- కొరటాల మూవీ క్యాన్సిల్.. రీజన్ చెప్పిన డైరెక్టర్.. మెగా పవర్ స్టార్ రియాక్షన్

సినీ ఇండస్ట్రీ ఏ సినిమాకు ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో.. ఏ సినిమా ఏ క్షణాన ఆగిపోతుందో ఎవ్వరూ ఊహించలేరు. కారణాలు పలు రకాలైనప్పటికీ ఒక్కోసారి క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయి తీరా సెట్స్ మీదకు వెళ్ళలేదంటే ప్రేక్షకులు బాగా నిరాశ చెందుతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హిట్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే ఇప్పుడు ఇందుకు కారణం ఏంటో కూడా తెలిసింది. వివరాల్లోకి పోతే..

పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కూడా కొట్టాక

పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కూడా కొట్టాక

అప్పట్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'మిర్చి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న కొరటాల శివ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ రామ్ చరణ్‌తో ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఈ సినిమా పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్న సమయంలో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. దీంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 కారణాలు బయటకు రాలేదు కానీ..

కారణాలు బయటకు రాలేదు కానీ..

ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు బయటకు రాలేదు కానీ.. ఆ వెంటనే కొరటాల శివ.. మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు', ఎన్టీఆర్‌ హీరోగా 'జనతా గ్యారేజ్' సినిమాలు చేశాడు. ఇటీవలే తిరిగి అదే మహేష్ బాబుతో 'భరత్ అను నేను' రూపంలో భారీ హిట్ సాధించారు. కానీ చరణ్‌తో చేయాలనుకున్న సినిమా మాత్రం ముందుకు వెళ్లలేదు.

 పెద్ద కారణమే ఉంది.. స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తి

పెద్ద కారణమే ఉంది.. స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తి

అయితే ఈ సినిమా సెట్స్ మీదకు రాకపోవడానికి పెద్ద కారణమే ఉందట. ముందుగా రామ్ చరణ్‌కు కొరటాల శివ ఓ కథ చెప్పి ఓకే చెేయించుకున్నాడు.కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ విషయంలో ఆయనకు కాస్త అసంతృప్తి కలిగిందట. ఆ స్క్రిప్ట్‌ని ఎన్నిసార్లు మార్పులు చేసినా అనుకున్నట్లుగా రాలేదట. దీంతో కొరటాల ఓ డిసీజన్‌కి వచ్చారట.

ఎలాగూ సినిమా ప్రకటించాం కదా అని తీసేయడం కరెక్ట్ కాదు

ఎలాగూ సినిమా ప్రకటించాం కదా అని తీసేయడం కరెక్ట్ కాదు

ఏదో ఎలాగూ సినిమా ప్రకటించాం కదా అని తీసేయడం కరెక్ట్ కాదని భావించి సినిమాను ఆపేయాలని అనుకున్నారట కొరటాల. ఇదే విషయాన్ని రామ్ చరణ్‌కు చెప్పగా.. మీకు కథపై పూర్తి కాన్ఫిడెంట్ ఎపుడు వస్తే అపుడే సినిమాను మొదలు పెడదాం అని చాలా ఫ్రెండ్లీగా అన్నారట మెగా పవర్ స్టార్. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొరటాల ప్రస్తావించారు. ఎప్పటికైనా రామ్ చరణ్ తో పక్కాగా సూపర్ హిట్ సినిమా తీస్తానని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

మెగా 152 మూవీ

మెగా 152 మూవీ

ఇక ప్రస్తుతం కొరటాల శివ, రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కాకపోతే రామ్ చరణ్ ఇందులో హీరో కాదు.. నిర్మాత. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనుండగా, చెర్రీ నిర్మాతగా వ్యహరించనున్నారు. అతిత్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X