twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితంలో ఇద్దరే మహిళలు: శ్రీరెడ్డి ఇష్యూపై కొరటాల శివ స్పందన

    By Bojja Kumar
    |

    Recommended Video

    Koratala Shiva Gives Explination About Sri Reddy Issue

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు.... టాలీవుడ్లో సంచలనంగా మారిన కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో కొరటాల శివ పేరు రావడం, శ్రీరెడ్డి అతడిపై ఆరోపణలు చేసిందంటూ సోషల్ మీడియాలో వాట్సాప్ చాట్ సర్క్యులేట్ అవ్వడంతో అంతా షాకయ్యారు. చూడటానికి సుద్దపూసలా కనిపించే కొరటాల శివ ఇలాంటోడా? అనే అనుమానాలు తెలుగు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇంత కాలం 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో స్పందించలేక పోయిన కొరటాల..... తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

    క్లారిఫికేషన్ కోసమే

    క్లారిఫికేషన్ కోసమే

    భరత్ అనే నేను మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. గత రెండు వారాల నుండి నేను, మా టీం రోజూ 18 నుండి 20 గంటలు పని చేస్తూ ఫైనల్ కాపీ రెడీ చేశాం. ఫైనల్ ఔట్ పుట్ చూసి ఎంటైర్ టీం చాలా ఆనందంగా ఉంది. సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టేముందు ఒక చిన్న ఇష్యూ గురించి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనిపించింది. లాస్ట్ వీక్ నా గురించి ఏవో స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్య్కులేట్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ బిజీగా ఉండి వాటిపై స్పందించలేక పోయాను.... అని కొరటాల తన వివరణ మొదలు పెట్టారు.

     కాస్టింగ్ కౌచ్ అంశానికి పూర్తి వ్యతిరేకం

    కాస్టింగ్ కౌచ్ అంశానికి పూర్తి వ్యతిరేకం

    పర్సనల్‌గా నేను కాస్టింగ్ కౌచ్ అంశానికి పూర్తిగా వ్యతిరేకం. నాకు తెలిసిన వాళ్ల దగ్గర కూడా ఇలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. అందుకే ఈ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు 4 సినిమాలకు పని చేశాను. చాలా మంది యాక్టర్లు, టెక్నీషియన్లతో చేశాను. నేను వారిని ఎలా ట్రీట్ చేస్తానో అందరికీ తెలుసు. ఎంతో రెస్పెక్టుతో నా పని నేను చేసుకుంటూ వెళతాను.... అని కొరటాల తెలిపారు.

    మనసు చివుక్కుమంటుంది

    మనసు చివుక్కుమంటుంది

    అందరి పట్ల నేను, నా టీం ఎంతో మర్యాదగా ఉంటాము. ఆడవారు, మగవారు అని మాత్రమే కాదు మనమంతా మనుషులం అనే లెక్కలో ఉంటాం. ఎవరినైనా అండీ అనడం తప్ప... చిన్న ఆర్టిస్టును కూడా పేరు పెట్టి పిలవం. నా టీమ్ కూడా అలాగే ఉంటుంది. ఇండస్ట్రీలో అక్కడక్కడా ఇలాంటి పనులు జరుగుతున్నపుడు కూడా మేము వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. బెటర్ సొసైటీ కోసం ఎప్పుడూ తపన పడుతుంటాం. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు, యంగ్ యాక్టర్లు వస్తున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో ఉన్నపుడు మనకు కూడా మనసు చివుక్కుమంటుంది.... అని కొరటాల చెప్పుకొచ్చారు.

    వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు

    వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు

    కాస్టింగ్ కౌచ్ వివాదంలో చాలా మంది పేర్లు వచ్చాయి. అందులో నా పేరు రావడంతో షాకయ్యాను. ఎంత బిజీగా ఉన్నా సరే ఒక సైడ్ అది నన్ను లాగుతా ఉంది. ఎక్కడైనా పొరపాటున వచ్చిందా? అందరితో పాటు వచ్చిందా? అనేది నాకు అర్థం కాలేదు. ఖాళీగా ఉన్నపుడు ఫ్రెండ్స్‌ను ఈ విషయమై ఎంక్వయిరీ చేస్తే...... ఆవిడ కూడా ఎప్పుడూ నా పేరు మెన్షన్ చేయలేదు, ఎక్కడా పోస్టు చేయలేదు... దీనిపై రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో దీనిపై బాగా చర్చ జరుగుతోంది కాబట్టి నేను ఇపుడు మీకు వివరణ ఇచ్చుకోవాలనుకుంటున్నాను..... అని కొరటాల తెలిపారు.

    శ్రీరెడ్డి పోరాటానికి ఫుల్ సపోర్ట్

    శ్రీరెడ్డి పోరాటానికి ఫుల్ సపోర్ట్

    మనం అంతా ఒకరినొకరు గౌరవం ఇచ్చుకోవాలి. మహిళలకు మనం గౌరవం ఇవ్వాలి. న్యాయం కోసం పోరాటం చేయాలి. వారి పోరాటానికి సపోర్టు ఇవ్వాలి. నేను వారి పోరాటానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను... అంటూ శ్రీరెడ్డి పేరు ప్రస్తావించకుండా కాస్టింగ్ కౌచ్ అంశంపై జరుగుతున్న పోరాటానికి తన మద్దతు ప్రకటించారు కొరటాల.

    నా బ్యాగ్రౌండ్ అలాంటిది కాదు

    నా బ్యాగ్రౌండ్ అలాంటిది కాదు

    నేను అలాంటి బ్యాగ్రౌండ్ నుండి రాలేదు, అలాంటి మాటలు మాట్లాడను, అలాంటి లాంగ్వేజ్ వాడను, సెట్లో కూడా ఎప్పుడూ నా నుండి అలాంటి మాటలు రావు. పర్సనల్ గా నేను అలాగే ఉంటాను. సినిమాల్లో కూడా ఎక్కడైనా మహిళలకు వ్యతిరేకంగా చిన్న రాంగ్ సీన్ పడితే వెంటనే మార్చేస్తాను. అంత పిన్ పాయింటెడ్ గా ఉంటాము. నా పేరు మీద కాస్టింగ్ కౌచ్ అంశంలో డిస్క్రషన్ జరుగుతుంది కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.... అని కొరటాల తెలిపారు.

    నా జీవితంలో ఇద్దరే మహిళలు

    నా జీవితంలో ఇద్దరే మహిళలు

    నా జీవితంలో ఇద్దరే మహిళలు. నా చిన్నతనంలోనే తండ్రి పోయాడు. నా తల్లే నన్ను పెంచారు. నా మ్యారేజ్ అయిన కొన్నేళ్లకు ఆవిడ చనిపోయారు. అప్పటి నుండి నాకు అన్నీ నా భార్యే. ఆమె స్వామి వివేకానంద స్ట్రాంగ్ ఫాలోవర్. మేమంతా కూడా అలాగే ఉంటాం. నా జీవితంలో ఎక్కువ ట్రావెల్ అయింది వారిద్దరితోనే. మాది పెద్ద ఫ్యామిలీ కాదు. రిలేటివ్స్ కూడా పెద్దగా లేరు. ఇద్దరు మహిళలతో నా జీవితం సాగడం వల్ల మహిళలకు ఎంత విలువ ఇవ్వాలో తెలుసు. పర్సనల్ గా మాత్రమే కాదు, ప్రొఫెషనల్ గా కూడా సినిమాల్లో అలాంటివి లేకుండా చూసుకుంటాము... అని కొరటాల తెలిపారు.

     ఎవరూ నా పేరు చెప్పలేదు, భార్య ఫుల్ సపోర్ట్

    ఎవరూ నా పేరు చెప్పలేదు, భార్య ఫుల్ సపోర్ట్

    ఎవరూ నా పేరు చెప్పక పోయినా... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా భార్య కూడా ఈ విషయంలో నాకు సపోర్ట్ ఇచ్చారు. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు ఇలాంటివి వస్తుంటాయి. స్వామి వివేకానంద మీద కూడా అమెరికా వెళ్లినపుడు వదంతులు వచ్చాయి. మనం స్వతహాగా ఏమిటి అనే విషయమై క్లారిటీ ఇస్తే సరిపోతుంది అని ఆమె ధైర్యం ఇవ్వడంతో ఇలా మీ ముందుకు వచ్చాను అని కొరటాల తెలిపారు.

    English summary
    Koratala Siva Reacts On Sri Reddy Issue. In a video message, Siva Koratala today has reacted to all the allegations and said that he was caught up with the post production works of his upcoming film Bharat Ane Nenu. Siva Koratala further added that he has utmost respect for women in his life and has never done anything which will hurt or insult women.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X