Devara ఎన్టీఆర్ మూవీ దిమ్మతిరిగే అప్‌డేట్ ఇచ్చిన కొరటాల శివ.. వీడియో స్పీచ్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సంయుక్తంగా రూపొందుతున్న దేవర. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ నందమూరి, అలాగే సినీ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
నేను దేవర సినిమా దర్శకుడు కొరటాల శివను. ఈ సినిమాను మరుగునపడి.. ఎవరికీ తెలియని భారత్ కోస్తా తీరంలోని భూముల గురించిన కథతో తెరకెక్కిస్తున్నాం. కథ చాలా బిగ్ స్టోరి. దేవర షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా గొప్పగా, పెద్దగా కథను చెప్పాలనే ఫీలింగ్ కలిగింది. షూటింగ్ సమయంలో కథ ఇంకా ఇంకా ఏదో అడిగే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌కు బలమైన బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అందుచేత చాలా లోతుగా అధ్యయనం చేసి పాత్రలను డెప్త్‌గా షూట్ చేస్తున్నాం అని కొరటాల శివ తెలిపారు.

షూటింగ్‌కు ముందు మేము దేవర సినిమాను ఒక పార్టుగా చేయాలని అనుకొన్నాం. కానీ మేము ఊహించుకొన్న కథ పరిధులు దాటి భారీగా విస్తరించింది. అందుచేత ముందుగా మేము అనుకొన్నట్టుగా ఈ సినిమాను రెండు పార్టులుగా తీయాలని నిర్ణయం తీసుకొన్నాం. ఈ కథను లోతుగా, డీటైల్‌గా చెప్పాలనే ప్రయత్నంలో రెండు భాగాలను చూపించబోతున్నాం. అంత మాత్రాన కథ ఏమీ మారిపోదు. కథకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను అని కొరటాల శివ తెలిపారు.
వెండితెరపైన అద్బుతమైన కథగా దేవరను చూపించబోతున్నాం. అన్ని హంగులతో ఈ సినిమా పార్ట్ 1ను 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించగలరని కోరుకొంటున్నాం. ఈ కథలో ఎలాంటి మార్పులు చేయకుండానే రెండు పార్టులుగా తీసుకొస్తున్నాం అని కొరటాల శివ వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటిర్‌గా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా సాంకేతిక వర్గంలో యుగంధర్ టీ, సందీప్ గుణ్ణం కీలకంగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











