ఆసక్తి రేకెత్తిస్తున్న మహేష్ బాబు సీఎం పాత్ర.. కేవలం 15 నిమిషాలు మాత్రమే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం ఏప్రిల్ 20 న ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతుండడంతో ఆ ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువైపోతోంది. మహేష్ రాజకీయ నాయకుడిగా ఎలా నటించాడు, ముఖ్యమంత్రిగా ఎలాంటి పోరాటాలు చేస్తాడు అనే విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ముఖ్యమంత్రి పాత్ర గురించి ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించాడు. మహేష్ బాబు మొదటి 15 నిమిషాల వరకే సాధారణంగా కనిపిస్తాడని ఆతరువాత సీఎం ఐపోతాడని అన్నారు. ఇక సినిమా చివరి వరకు మహేష్ ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని కొరటాల ఉత్కంఠ పెంచేశారు.


Click it and Unblock the Notifications











