twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు డబ్బింగ్ థియేటర్లో ఆయన్ను తిడతారు, కొడతారట!

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా 24 క్రాఫ్ట్స్ లో ముఖ్య‌మైన విభాగాల్లో తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ఒక‌టి.. ఈ యూనియ‌న్ ఈ సంవ‌త్సంరం తో 25 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంటుంది. ఈ సంద‌ర్బంగా యూనియ‌న్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌, సెక్ర‌ట‌రి మ‌రియు ఈసి మెంబ‌ర్స్ అంద‌రూ క‌ల‌సి సిల్వ‌ర్ జూబ్లి ఫంక్ష‌న్ ప్లాన్ చేశారు. జూన్ 10‌న గ్రాండ్‌గా అన్న‌పూర్థా స్టూడియోలొ ఈ వేడుక జరుపనున్నారు. ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయనతో పాటు ఇండ‌స్ట్రికి చెందిన పలువురు హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల, 24 క్రాఫ్ట్స్ లోని ముఖ్యలు హ‌జ‌ర‌ు కానున్నారు.

    కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన కొరటాల

    కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన కొరటాల

    జూన్ 10న జరిగే ఈ వెంటుకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇటీవల కరెక్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ ఈ కార్యక్రమానికి హాజరై క‌ర్ట‌న్ రైజ‌ర్ మ‌రియు థీమ్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలను డబ్బింగ్ ఆర్టిస్ట్ పప్పు నిర్వహిస్తున్నారు.

     పప్పు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కొరటాల

    పప్పు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కొరటాల

    నేను తీసిన మూడు నాలుగు సినిమాలకు డబ్బింగ్ విషయంలో పప్పుగారే ఇంచార్జ్. తను తీసుకునే కేర్ చాలా బావుంటుంది. హీరో వాయిస్ తప్ప మిగతావన్నీ ఆయనకే అప్పగించే వాడిని. ఒక సినిమాకు డబ్బింగ్ కళాకారులు ఎంతో ముఖ్యం. అలాంటి వారి యూనియన్ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది.... అని కొరటాల శివ అన్నారు.

     నన్ను చాలా విసిగించాడు

    నన్ను చాలా విసిగించాడు

    ‘భరత్ అనే నేను' సినిమా రిలీజ్ సమయం దగ్గరపడి డబ్బింగ్ జరుగుతున్నపుడు నాకు చాలా టెన్షన్ ఉండేది. ఓ వైపు మహేష్ బాబుతో డబ్బింగ్ చెప్పించాలి, షూటింగ్ చేయాలి. మేము ఆ టెన్షన్లో ఉంటే.... చిన్న సందుదొరికితే చాలు పప్పు ఈ డబ్బింగ్ ఆర్టిస్టుల 25 ఇయర్స్ ప్రోగ్రాం గురించి చెప్పేవారు. నేనేమో నా సినిమా టెన్షన్లో ఉంటే ఈయన గోల ఏంటని అనుకునేవాడిని. సరే ఒకసారి చెప్పాడు ఓకే. ప్రతి పదినిమిషాలకోసారి... డబ్బింగ్ జరిగినన్ని రోజులు చెప్పినపుడు అర్థమైంది ఈ ఈవెంటు ఆయనకు ఎంత ఇంపార్టెంటో.... అని

    మహేష్ బాబు తిడతాడు, కొడతాడు... అంత క్లోజ్

    మహేష్ బాబు తిడతాడు, కొడతాడు... అంత క్లోజ్

    పప్పు నన్ను గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది పెట్టలేదు. ఒక ‘భరత్ అనే నేను' సమయంలోనే ఈ ఈవెంటు గోలతో విసిగించాడు. పైగా ఆయన మహేష్ బాబుకు చాలా క్లోజ్ మనిషి. ఎంత క్లోజ్ అంటే మహేష్ ఆయన్ను తిడుతుంటారు, కొడుతుంటారు కూడా.

    నేనే ఆయనకు చెప్పాను

    నేనే ఆయనకు చెప్పాను

    మహేష్ బాబు అంత క్లోజ్ అయినా సరే... ఆయన ఎప్పుడూ నేరుగా మహేష్ బాబుకు ఈ విషయం చెప్పలేదు. ప్రొఫెషన్ ప్రొఫెషనే నేను దాన్ని వాడుకోకూడదు అనే ఆలోచనలో ఉంటారు. ఈ విషయం చివరకు నేను మహేష్ బాబు చెప్పాను. సార్ నేను మీకు ఒక విషయం ఒకే నిమిషయంలో చెబుతాను. కానీ ఆయన దాన్ని వందల నిమిషాలు చెప్పారు. అంత ఇంపార్టెంట్ ఇది, మీరు ఆ ఈవెంటుకు తప్పకుండా వెళ్లాలి అన్నాను. మహేష్ బాబు వెంటనే డేట్ చేసుకుని ప్లాన్ చేసుకోమని చెప్పారు. మహేష్ బాబు ఈ ఈవెంటుు వంద శాతం వస్తున్నారని అనుకుంటున్నాను... అని కొరటాల శివ వ్యాఖ్యానించారు.

    English summary
    Koratala Siva Reveals Mahesh Babu and Dubbing artist Pappu close friendship. Mahesh Babu is an Indian actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd. The younger son of veteran Telugu actor Krishna, Mahesh made his cameo as a child artist in Needa (1979), at the age of four, and acted in eight other films as a child artist. He made his debut as a lead actor with Rajakumarudu (1999) and won the State Nandi Award for Best Male Debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X