కొరటాల శివ RRR ప్లాన్.. సెట్టయితే షూటింగ్ స్టార్ట్ చేయడమే..

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా బిగ్ బడ్జెట్ సినిమాలకు గట్టి దెబ్బె పడింది. దాదాపు 7నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే కొందరు ధైర్యం చేసి షూటింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ మరికొందరు మాత్రం ఇంకా రిస్క్ చేయడానికి భయపడుతున్నారు. ఇటీవల RRR షూటింగ్ ని మొదలు పెట్టిన దర్శకుడు రాజమౌళి మిగతా వాళ్ళకు కూడా కాస్త నమ్మకాన్ని కలిగించారు. కొమురం భీమ్ టీజర్ ని తప్పకుండా రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పట్లో ఆ షూటింగ్ కి బ్రేకులు పడే అవకాశం లేదని అర్ధమయ్యింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే దర్శకుడు రాజమౌళి మొదటి రెండు రోజులు హీరోలతో కాకుండా టెక్నీషియన్స్ తో కలిసి టెస్ట్ షూట్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆ ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక మరో స్టార్ దర్శకుడు కొరటాల శివ కూడా అదే తరహాలో టెస్ట్ షూట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈపాటికే ఆచార్య షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ మెగాస్టార్ తో ఈ వయసులో రిస్క్ చేయించాలని రామ్ చరణ్ అనుకోవడం లేదు.

 Koratala siva RRR Plan ready for acharya shooting

అసలైతే పూర్తిగా కరోనా తగ్గిన తరువాతే నాన్న షూటింగ్ కి వస్తాడని అంత వరకు వేరే సీన్స్ ఉంటే ఫినిష్ చేసుకోవాలని రామ్ చరణ్ సలహా ఇచ్చారట. ఇక కొరటాల అందుకు ఒప్పుకున్నప్పటికి చిరంజీవిని అలాగే రామ్ చరణ్ లను ఇద్దరిని లోకేషన్స్ కి రప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకొని RRR తరహాలోనే టెస్ట్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. మూడు రోజుల తరువాత నమ్మకంగా అనిపిస్తే మెగాస్టార్ తో సీన్స్ ని స్టార్ట్ చేయాలని ఒక డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కొరటాల మాత్రం వీలైనంత త్వరగా ఆచార్య షూటింగ్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X