రాంచరణ్ లేక ప్రభాస్.. ఆ దర్శకుడి హీరో ఎవరు !
రచయితగా కొనసాగుతున్న తరుణంలో కొరటాల శివ మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొరటాల పొజిషన్ గురించి సపరేటుగా చెప్పనవసరం లేదు. వరుస బ్లాక్ బాస్టర్ లతో ఈ దర్శకుడు దూసుకుని పోతున్నాడు. ప్రజెంట్ కొరటాల శివ మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మిర్చి చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తి కావడంతో ఇండస్ట్రీలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.

ఐదేళ్ల క్రితం సంచలనం
ప్రభాస్ ఫోకస్ మొత్తం బాహుబలి వైపు మరలుతున్న తరుణంలో కొరటాల చకచకా మిర్చి చిత్రాన్ని పూర్తి చేసేసాడు. అభిమానుల్లో కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ విడుదలయ్యాక ఈ చిత్రం తొలిసారి ప్రభాస్ ని 40 కోట్ల క్లబ్ లోకి చేర్చింది.
Recommended Video


బిల్లా తరువాత ఈ చిత్రంలోనే
బిల్లాలో ప్రభాస్ ఎంత స్టైలిష్ గా కనిపించాడో మిర్చిలో అంతకు రెండింతలు స్టైలిష్ గా కనిపించాడు. రొటీన్ కథకే కొరటాల తన మ్యాజిక్ జోడించడంతో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

గాలివాటం కాదు
మిర్చి చిత్రం గాలివాలుగా వచ్చిన హిట్ అని పెదవి విరిచిన వారికి నెక్స్ట్ మూవీ తోనే కొరటాల సమాధానం ఇచ్చాడు. మిర్చి తరువాత మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న కొరటాల శ్రీమంతుడు చిత్రం ద్వారా రికార్డులు సృష్టించాడు. టాలీవుడ్ లో శ్రీమంతుడు చిత్రం బాహుబలి తరువాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఎన్టీఆర్ తో సక్సెస్ కంటిన్యూ
శ్రీమంతుడు చిత్రం తరువాత కొరటాల డైరెక్ట్ చేసిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం కూడా కోరాలని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుతం కొరటాల తిరిగి మహేష్ ని భరత్ అనే నేనుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్
కొరటాల శివ ప్రస్తుతం స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. కమర్షియల్ చిత్రాలలో కూడా అంతర్లీనంగా తనదైన శైలిలో సందేశాన్ని జోడించడం ఈ దర్శకుడి ప్రత్యేక. కొరటాల ఫార్ములా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవుతుండడంతో నిర్మాతలు, హీరోలు కొరటాల కోసం ఎదురు చూపులు మొదలుపెట్టారు.

వాళ్ళిద్దరిలో ఎవరు
మిర్చి విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తి కావడంతో కొరటాల ప్రభాస్ కు, మిర్చి టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేసాడు. కొరటాల తదుపరి హీరో ఎవరు అనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం మొదలైంది. కొరటాల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయవలసి ఉంది. కానీ రామ్ చరణ్ రాజమౌళితో బిజీ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో రెండవ సినిమా చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు కొత్త న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











