twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నా.. రంగస్థలం రాగానే సగం టెన్షన్ తగ్గింది.. కొరటాల శివ!

    |

    భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించడంతో చిత్ర యూనిట్ మొత్తం సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. శనివారం భరత్ బ్లాక్ బాస్టర్ సెలెబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మహేష్ బాబు, కొరటాల శివ తో పాటు నటీ నటులు, చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు. మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. విడుదల తరువాత కూడా మహేష్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ లో పాల్గొంటుండడం చిత్రానికి కలసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకున్న భరత్ అనే నేను చిత్రం రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్

    బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్

    తాను చేసిన నాలుగు చిత్రాలలో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రం అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. దానయ్య వంటి నిర్మాత లేకపోతే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని అన్నారు. చిత్రానికి ఎక్కువ బడ్జెట్ చివరి షెడ్యూల్ లోనే అయిందని, వచ్చాడయ్యో, ఫారెన్ లో షూట్ చేసిన సాంగ్ చివరి షెడ్యూల్ లోనే చిత్రీకరించినట్లు కొరటాల తెలిపారు.

    హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నా

    హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నా

    మహేష్ బాబుతో శ్రీమంతుడు చిత్రం నుంచి అద్భుతమైన జర్నీ మొదలైందని అన్నారు. శ్రీమంతుడుని మించేలా ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ తో హ్యాట్రిక్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నాని కొరటాల అన్నారు.

    మహేష్ వీరాభిమానిది ఈ కథ

    మహేష్ వీరాభిమానిది ఈ కథ

    మహేష్ బాబుని సీఎంగా చూపించాలనే ఆలోచన తన స్నేహితుడు, రచయిత శ్రీహరిది అని కొరటాల అన్నారు. భరత్ అనే నేను చిత్ర కథ ఆయన అందించినదే అని కొరటాల శివ స్టేజిపై వివరించడం విశేషం. శ్రీహరి మహేష్ బాబుకు వీరాభిమానిని, ఏ కథ రాసుకున్నా మహేష్ ని దృష్టిలో పెట్టుకుని రాస్తారని అన్నారు.

    మావయ్యకి థాంక్స్

    మావయ్యకి థాంక్స్

    కొరటాల.. తన గురువు పోసాని గురించి సరదాగా మాట్లాడారు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాను ఆ తాను ఆయనతోనే యాక్షన్ చెప్పించడం సంతోషంగా ఉందని కొరటాల అన్నారు. పోసాని మావయ్యకి థాంక్స్ అని కొరటాల తెలిపారు.

    రంగస్థలంతో సగం టెన్షన్ తగ్గింది

    రంగస్థలంతో సగం టెన్షన్ తగ్గింది

    కొరటాల తన ప్రసంగం చివర్లో రాంచరణ్ రంగస్థలం చిత్రం గురించి మాట్లాడారు. రంగస్థలం చిత్రం విడుదలయ్యాక తనకు సగం టెన్షన్ తగ్గిందని అన్నారు. రంగస్థలం చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో టాలీవుడ్ కి బ్లాక్ బాస్టర్ సీజన్ మొదలైందని భావించానని అన్నారు. అలాగే భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులు మరో బ్లాక్ బాస్టర్ అందించారని అన్నారు.

    English summary
    Koratala Siva speech at Bharat Blockbuster Celebrations. Koratala talks about Rangasthalam movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X