twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్, కొరటాల సినిమా కథ తెలిసిపోయింది..సీఎం టార్గెట్, డైలాగులు పగిలిపోతాయి!

    |

    Recommended Video

    భరత్ అనే నేను చిత్రం టార్గెట్ ఎవరో తెలిసిపోయింది

    సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం భరత్ అనే నేను. మహేష్ ని కొరటాల శివ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీమంతుడు చిత్రంలో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో వచ్చిన కొరటాల బ్లాక్ బాస్టర్ కొట్టాడు. మరో మారు మహేష్ కోసం పవర్ ఫుల్ కథతో భరత్ అనే నేను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా భరత్ అనే నేను చిత్ర కథ గురించి మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

    పరాజయంలేని దర్శకుడు.

    పరాజయంలేని దర్శకుడు.

    ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకుడు కొరటాల శివనే. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ఆయన ప్రభాస్ తో మిర్చి సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ చిత్రాలు కూడా ఘనవిజయం సాధించాయి.

    కమర్షియల్ సినిమాల్లో మెసేజ్

    కమర్షియల్ సినిమాల్లో మెసేజ్

    కమర్షియల్ చిత్రాలలో తనదైన శైలికి సామజిక సందేశాన్ని జోడించడం కొరటాలకే చెల్లింది. ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఆయనకు విజయాలు దక్కుతున్నాయి.

    ఊరిని దత్తత తీసుకునే శ్రీమంతుడు

    ఊరిని దత్తత తీసుకునే శ్రీమంతుడు

    మహేష్ బాబుతో కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రం అభిమానులని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఊరిని దత్తత తీసుకునే అంశాన్ని జోడించారు. ఊరిని దత్తత తీసుకునే సామజిక అంశంతో పాటు మిగిలిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా కొరటాల చక్కగా బ్యాలన్స్ చేసారు.

    ఎన్టీఆర్ తో మరో బ్లాక్ బాస్టర్

    ఎన్టీఆర్ తో మరో బ్లాక్ బాస్టర్

    ఎన్టీఆర్ తో కొరటాల తెరకెక్కించిన జనతా గ్యారేజ్ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో కొరటాల హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు.

    ఈ సారి రాజకీయంపై గురి

    ఈ సారి రాజకీయంపై గురి

    కొరటాల ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఉమ్మడి ఏపీ నేపథ్యంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. సమాజంలోని ప్రధాన సమస్యలని ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా పరిష్కరించాడో ఈ చిత్రంలో కొరటాల చూపించబోతున్నారు.

    అంచనాలు పెరిగిపోయాయి

    అంచనాలు పెరిగిపోయాయి

    టీజర్ విడుదలయ్యాక భరత్ అనే నేను చిత్రంపై అంచనాలుఅమాంతం పెరిగిపోయాయి. ముఖ్యమంత్రిగా స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు అదరగొడుతున్నాడు. ఇక ఈ స్టైలిష్ సీఎం సినిమాలో చేసే విన్యాసాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    భరత్ అనే నేను కథ లీకులు

    భరత్ అనే నేను కథ లీకులు

    భరత్ అనే నేను చిత్రం పొలిటికల్ డ్రామా గా రాబోతోందనేది ఖాయం.ఈ చిత్రంలో కొరటాల శివ ఎలాంటి సామజిక సమస్యలపై గురిపెట్టాడు అనే ఆసక్తి కలుగుతోంది. ప్రామిస్ చేసి మాట తప్పితే మనిషే కాదు అనే పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. కాగా మీడియాలో భరత్ అనే నేను కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

    సీఎం గురి వీటిపైనేనా

    సీఎం గురి వీటిపైనేనా

    భరత్ అనే నేను చిత్రంలో కొరటాల శివ ప్రధానంగా కొని సమస్యలని హైలైట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, విద్య గురించి ఈ చిత్రంలో ప్రధానమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లలో మహేష్ పలికే డైలాగులు ఆకట్టుకోవడం ఖాయం అని సమాచారం.

    కేంద్రంపై బాణం

    కేంద్రంపై బాణం

    కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేయవలసిన ఫండ్స్ అంశం గురించి కూడా ఈ చిత్రంలో ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కొరటాల శివ కొన్ని అద్భుతమైన డైలాగులు రాశారట.

    మరో బ్లాక్ బాస్టర్ ఖాయం

    మరో బ్లాక్ బాస్టర్ ఖాయం

    భరత్ అనే నేను చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. కొరటాల ఈ చిత్రం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. మరో బ్లాక్ బాస్టర్ ఖాయం అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Koratala Siva targets social issues in Bharat ane nenu movie. He is directing Mahesh Babu second time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X