twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన విద్యా వ్యవస్థ మీద కొరటాల అసహనం: మారాల్సిందే అంటూ ట్వీట్

    'మన విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హాయిగా ఆనందిస్తూ.. చదువుకునే రోజులని మళ్లీ తీసుకురావాలి...' అంటూ కొరటాల శివ ట్వీట్ చేశారు.

    |

    కొరటాల శివ టాలీవుడ్ లో ఒక స్పెషల్ గుర్తింపున్న దర్శకుడు. ప్రతీ సినిమా ఏదో ఒక రకమైన సమాజిక లోపాన్ని తీసుకొని పక్కా పాజిటివ్ వే లో చెప్పాలని ప్రయత్నించటం శివ పద్దతి. కొన్ని సార్లు ట్వీట్లలోనే అతనిలో ఆవేశం ఎ స్థాయిలో ఉందో తన మాటల వేడిలో చూపించారు. సొసైటీలో వ్యవస్థని బాగుచేయాలనే ఆలోచన ఎ ఒక్కరిలో కనిపించడం లేదని. అవకాశం ఉంటె వ్యవస్థని మనం ఎలా వాడుకోవాలని అనే కోణంలో ఆలోచిస్తున్నారని అన్నారు.

    రాజకీయాలు నీచమైన స్థాయికి

    రాజకీయాలు నీచమైన స్థాయికి

    ఇక సొసైటీలో విద్యావ్యవస్థ, రాజకీయాలు చాలా నీచమైన స్థాయికి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు రాజకీయాలను, రాజకీయ నాయకులని చాలా నీచంగా చూస్తున్నారని. వాళ్ళు ఎం చేసిన పోనీలే అనే విధంగా వదిలేస్తున్నారని, అలాగే ప్రజలన్నా రాజకీయ నాయకులని చులకన భావం అని అన్నారు.

    అవినీతి ఆల్ టైమ్ రికార్డుకు

    అవినీతి ఆల్ టైమ్ రికార్డుకు

    నాలుగు అబద్ధాలు, రెండు బిస్కెట్స్ వేస్తే ప్రజలు నోర్మూసుకుంటారని రాజకీయ నాయకుల అభిప్రాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

    విద్యావ్యవస్థలో మార్పు రావాలి

    విద్యావ్యవస్థలో మార్పు రావాలి

    తాజాగా శివ తన ట్విట్టర్ పేజీలో విద్యావ్యవస్థ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'మన విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హాయిగా ఆనందిస్తూ.. చదువుకునే రోజులని మళ్లీ తీసుకురావాలి...' అంటూ కొరటాల శివ ట్వీట్ చేశారు.

    విద్యావ్యవస్థ ఎలా ఉందో

    విద్యావ్యవస్థ ఎలా ఉందో

    ఇది చిన్న ట్వీట్‌లా అనిపించినా, ఆయన చెప్పింది మాత్రం అక్షరసత్యం. ప్రస్తుత విద్యావ్యవస్థ ఎలా ఉందో తెలియంది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనేది పక్కన పెడితే.. నిజంగా కొరటాల శివ చెప్పినట్లుగా, చదువును ఆనందంగా ఇష్టపడి చదివే రోజులు వస్తే మాత్రం అంతకంటే ఇంకేం కావాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    "Need for a robust change in our education system. We should restore the joy of learning" Tweetes Tollywood director Koratala Shiva
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X