హీరోయిన్ కాజల్‌పై నోరు జారిన కోట శ్రీనివాసరావు!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. శుక్రవారం జరిగిన ‘గోవిందుడు అందరి వాడేలే' సక్సెస్ మీట్లో హీరోయిన్ కాజల్ గురించి ఆయన మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఔటాఫ్ స్టేషన్లో ఉండటం వల్ల ఈ సక్సెస్ మీట్‌కు రామ్ చరణ్ రాలేక పోయారు. అదే విధంగా వేరే సినిమా షూటింగులో ఉన్న కాజల్...ప్రెస్ మీట్ ప్రారంభమైనా హాజరు కాలేదు. లంచ్ బ్రేక్‌లో వీలు చూసుకుని కాస్త లేటుగా ఈ ప్రెస్ మీట్‌కు హాజరైంది.
కాజల్ రాక ముందు....కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘హీరోయిన్లు అందాలు చూపించడానికే గానీ, మాట్లాడటానికి కాదు కదా, ఆమె రాక పోయినా ఫర్వా లేదు' అంటూ సెటైర్లు వేసారు. ఈ లోగా కాజల్ రావడంతో, కాజల్ రాదనుకుని అలా మాట్లాడాను. నా మాటలు పట్టించుకోవద్దు అంటూ మీడియాతో అన్నారు.

కోట శ్రీనివాసరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. అనేక సందర్భాల్లో ఆయన నిర్మొహమాటంగా స్టేజీపైన పలువురిపై విమర్శలు చేసారు. ఇలాంటి విషయాల్లో కోట శ్రీనివాసరావు తీరుపై చాలా కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన వయసులో, సీనియార్టీలో పెద్ద వారు కావడంతో అంతా లైట్ తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











