తెలుగు డైరక్టర్స్, హీరోలే దెబ్బ కొడుతున్నారు...కోట శ్రీనివాసరావు
ఎంత కష్టపడ్డా, ఎన్ని ఫలితాలొచ్చినా ఏం లాభం ఉండటం లేదు. అందరి చూపూ పరభాషా నటులవైపే. ఆ విషయంలోనే నాకు కొంచెం అసంతృప్తి కలుగుతుంటుంద అంటున్నారు కోట శ్రీనివాసరావు. ఆయన క్రితం శుక్రవారం రిలీజైన గాయం సీక్వెల్ లో గురునారాయణ పాత్ర చేసారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. ఆయన మాటల్లోనే...పరభాషా నటులను పూర్తిగా దూరం పెట్టమని చెప్పను...ఏవో ప్రత్యేకమైన పాత్రలంటూ కొన్నుంటాయి. వాటికైతే ఏమో అనుకోవచ్చు. అక్క, చెల్లి, నాన్న, తమ్ముడు...ఇలా ప్రతిదానికీ పరభాషా నటులేనా. వాళ్లను అంతగా తలకెక్కించుకోవాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాదు. దీనికి కారణం దర్శకులు, హీరోలే. వారనుకుంటే పరభాషా నటులకు స్థానం ఉండదు. మన దగ్గర ఎంతో మంది నటులున్నారు. అవకాశమిస్తే నాలాంటి నటులు వంద మంది పుట్టుకొస్తారు. ఆ అవకాశమే ఇవ్వరు అన్నారు.


Click it and Unblock the Notifications











