అనుభవం లేకుండా దర్శకత్వం...కోట శ్రీనివాసరావు
ఏ మాత్రం అనుభవం లేని వాళ్లంతా దర్శకులైపోతున్నారు. కథ లేకుండా షూటింగ్ మొదలుపెట్టుకుని, లొకేషన్లో కూర్చుని సన్నివేశాలు అల్లుకుంటున్నారు. ఏ లెన్స్ దేనికి ఉపయోగించాలో కూడా తెలీదు. ఇలాంటి దర్శకులుంటే ఖర్చు పెరగకుండా ఉంటుందా? అంటున్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన్ని పరిశ్రమలో రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల గురించి అడిగితే...నిర్మాణ ఖర్చులు తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నటీనటుల పారితోషికం తగ్గించడమే ఇందుకు పరిష్కారమా అని అడిగితే పై విధంగా స్పందించారు. పారితోషికం తగ్గించుకోవటంతో సమస్య తీరిపోదు అన్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులను దిగుమతి చేసుకోవటంపై మండిపడుతూ..పరాయి రాష్ట్రంవాడు..అంటే మనోళ్లంతా నెత్తిన ఎక్కించుకుంటారు. నేను కూడా మిగతా భాషల్లో నటించిన వాణ్ణే. అక్కడ మనల్ని ద్వితియ శ్రేణి వర్గంగానే చూస్తారు. ఓ గొప్ప పాత్ర కోసం నసీరుద్దీన్‌షా లాంటి మహా నటుడ్ని తీసుకున్నా తప్పులేదు. ఆకారాల్ని చూసి తీసుకుంటే ఫలితాలు రావు అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











