తెలుగు దర్శకులపై దుమ్మెత్తి పోసిన కోట
తెలుగు సినీ రంగంలో మరో వివాదం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలు తెలుగు సినీ రంగంలో దుమ్ము రేపే పరిస్థితి నెలకొంది. తెలుగు సినీ దర్శకులపై ఆయన దుమ్మెత్తి పోశారు. తెలుగు దర్శకులు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. తెలుగు నటుల పట్ల దర్శకులు వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన ఓ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో కూడా తెలుగు నటుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలుగు నటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశం ఇవ్వకుండా తెలుగు దర్శకులంతా పరభాషా నటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం పూర్తిగా చల్లారక ముందే కోట శ్రీనివాస రావు తెలుగు దర్శకులపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











