twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేదిక మీదే కన్నీళ్ళతో కోటా శ్రీనివాసరావు, బాబూ మోహన్ : ఏం చెప్పారంటే....

    యాక్సిడెంట్‌ ఫ్రీ డే సందర్భంగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బాబూ మోహన్ కోటాలిద్దరూ ఇలా వారి మాటలూ వినిపిమంచారు

    |

    "యాక్సిడెంట్ అంటే కారో బైకో రోడ్డుమీద పడటం కాదు ఒక కుటుంబం రోడ్డున పడటం" సన్నాఫ్ సత్య మూర్తి సినిమా కోసం టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రం రాసిన డైలాగ్ ఇది. నిజమే కదా ఒక యాక్సిడెంట్ అంటే ఏదో ఒక వాహనం బోల్తా పడటం కాదు.., కొన్ని జీవితాలే తల్లకిందులైపోవటం.. అలా తీరని దుఃఖం తో ఇప్పటికీ ఎన్నో లక్షల కుటుంబాలు కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాయి.

    అందులో మనం ఎప్పటికీ మర్చిపోలేని ధారుణ సంఘటనల్లో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడి మరణం ఒకటైతే, సిద్దం లాంటి సినిమాల్లో చేసిన పాత్రలతో అందరికీ గుర్తుండిపోయే కోటా ప్రసాద్ మరణం ఇంకొకటి... అన్నిటికంటే మరింత విషాదం బాబూ మోహన్, కోటా ఇద్దరూ ప్రాణ మితృలే కాదు చాలా సినిమాల్లో అందరినీ నవ్వించిన వాళ్ళు...

    కానీ జీవిత కాలపు దుఃఖం మిగిల్చింది ఒక్క రోడ్డు ప్రమాదం... నీన్న యాక్సిడెంట్‌ ఫ్రీ డే సందర్భంగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మంగళ వారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితులు, తల్లిదండ్రులు తమ బాధను పంచుకున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్య లను వివరించారు. ఆ వేదిక మీదే బాబూ మోహన్ కోటాలిద్దరూ ఇలా వారి మాటలూ వినిపిమంచారు

    Kota Srinivasa Rao And Babu Mohan On Road Safety

    ఇలాంటి సమావేశాలకు రావడంవల్ల గతం గుర్తు కొస్తోంది. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, వారు మధ్యలోనే విడిచిపోతే వచ్చే బాధ తల్లిదం డ్రులకే తెలుస్తుంది. ఆ కడుపుతీపి ఇప్పటికీ నన్ను ఏడిపిస్తోంది. తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి మచ్చలేకుండా మంచి పేరు తీసుకు రావాలి.

    సాధనచేస్తే ప్రపంచంలో సాధించలే నిదంటూ ఏదీ ఉండదు. కడు దారిద్య్రం నుంచి వచ్చిన నేను నా కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశలపై మావాడు నీళ్లు చల్లి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయా డు. పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దు.

    ''పిల్లలు పుట్టగానే సంతోషిస్తాం. ఉన్నత స్థానంలో స్థిరపడాలని కలలుగంటాం. కానీ ఇప్పటి పిల్లలు పెడదోవపడుతున్నారు. తల్లిదండ్రులను హింసిస్తు న్నారు. నా కుమారుడిని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నా...'' అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు బాబుమోహన్.

    యువతకు ట్రాఫిక్‌ రూల్స్‌ అన్నీ తెలుసు. కానీ ఎవరూ పాటించరు. తల్లిదండ్రులను బెదిరించి వాహనాలు తీసుకుని రోడ్లపైకి వెళ్తు న్నారు. వాహనాన్ని కంట్రోల్‌ చేయలేక ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ఘటనల్లో అమాయకపు ప్రజలు కూడా ప్రాణాలు కొల్పోతున్నారు.

    నా కుమారుడి మరణం ఇప్పటికీ నన్ను కలిచి వేస్తోంది. నేను అనుభవిస్తున్న బాధను ఎవరు అనుభ వించకూడదు. ప్రస్తుతం యువతకు సాధనతక్కువ, వాదన ఎక్కువ. అందుకే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని రకాల వాహనాలనూ ఒకే రోడ్డుపై అనుమతించడంతో ద్విచక్రవాహనాలు లోనికి చొరబడుతున్నాయి. ప్రమాదాలకు ఇదో కారణం. అంటూ నటుడు కోతా శ్రీనివాసరావు ఆవేదనతో మాట్లాడారు.

    English summary
    MLA Babumohan and Actor Kota Srinivasa Rao participated in an Awareness program on Road Safety on Accident Free Day in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X