For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్

  |

  ప్రముఖ రచయిత, గొప్ప నటుడు గొల్లపూడి మారుతి రావు మరణంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో గత కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం మృతి చెందారు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వారే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

  నెల రోజుల కిందటే..

  నెల రోజుల కిందటే..

  గొల్లపూడి మారుతి రావు మృతి పట్ల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘గొల్లపూడి మారుతి రావు మరణ వార్త విని ఆశ్చర్యపో యాను.. ఆయన నాకు పర్సనల్ ఫ్రెండ్. డాక్టర్ చక్రవర్తి రాయడానికి వచ్చినప్పుడు పరిచయం.. అది స్నేహంగా మారింది.. ఫ్యామిలీ కూడా తెలుసు.. నెలరోజుల కిందట కూడా బాగానే మాట్లాడారు.

   ఆ సమయంలో మంచి సలహాలు..

  ఆ సమయంలో మంచి సలహాలు..

  అనుకోకుండా నటుడు అయ్యారు.. ఆయన కూడా అదే చెప్పేవారు.. నేను ఆయన కలిసి దాదాపు 39 సినిమాలు చేశాను.. సంసారం ఓ చదరంగం లాంటి సినిమాలు చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆయన ఎంతో స్నేహశీలిగా ఉండేవారు. ఏ రచనైనా సరే.. వ్యంగ్యంగానైననా, సెటైర్గా గానీ రాయగలడు.. మా అబ్బాయి పోవడం.. అంతకంటే ముందు ఆయన కుమారుడో పోవడం.. మా అందరికీ ఆ ఇబ్బంది కలిగింది.. మంచి నటుడివి చాలా బాధ్యత ఉందని మంచి సలహాలిచ్చేవారు.

  ఆ నాటిక అంటే చాలా ఇష్టం..

  ఆ నాటిక అంటే చాలా ఇష్టం..

  ఆయన మరణం.. సినిమా రంగానికి లోటు. ఆయన లేని లోటును పూడ్చలేము. మాలాంటి వారు నటుడిగానే ప్రయత్నాలు చేయగలం.. ఆయన రచయిత కాబట్టి, కూర్చుని రాయొచ్చు.. మంచి మంచి కథలు, కనువిప్పు కలిగేవి రాయొచ్చు. సరళి మార్చి, ప్రజలకు ఉపయోగపడేవి రాయండని చెప్పేవాడ్ని. ఆయన రాసిన వాటిలో ‘కళ్లు' నాటిక నాకు చాలా నచ్చుతుంది. ఆ సినిమాలో కూడా నేను నటించాను.. ఆయన లాంటి రచయిత, నటుడు లేకపోవడం తీరని లోటు. ఆయన ఓ మంచి స్నేహితుడు. ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాన'ని మీడియా ముఖంగా మాట్లాడారు.

  స్పందిస్తోన్న టాలీవుడ్..

  స్పందిస్తోన్న టాలీవుడ్..

  గొల్లపూడి మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందస్తున్నారు. మహేష్ బాబు, వరుణ్ తేజ్, నితిన్, సుధీర్ బాబు, నిఖిల్, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, కోన వెంకట్ లాంటి వారు స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

  English summary
  Tollywood senior actor Gollapudi Maruthi Rao passed away in chennai hospital. He died with Cardiac Attack. KCR Annapurna, Paruchuri Gopalkrishna, Mahesh Babu, Anil Ravipudi, Sudheer Babu, Allari Naresh, Varun Tej, Kajal Aggerwal, Talasani Srinivas Yadav, Nithin, Kona Venkat Etc Celebraties gave condolence to his death.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more