పవన్ కల్యాణ్‌పై కోట శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు.. జూనియర్ ఎన్టీఆర్‌ను వదలని సీనియర్ నటుడు!

స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సమాజానికి, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకొంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ పేరిట అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో సినీ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ మోమోరియల్ అవార్డు వేడుకల్లో కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్‌గా వి బి ఎంటర్టైన్మెంట్స్, ఏ వి ఇన్ఫ్రాకన్,పవర్డ్ బై ఐమార్క్ డెవలపర్,అసోసియేటెడ్ స్పాన్సర్స్ వి వి కే హౌసింగ్ ఇండియా, వండర్ డైమండ్స్,నావోకి,శ్రీయం ఐ టి సొల్యూషన్స్, కేశినేని డెవలపర్, ఔట్డోర్ పార్టనర్ మీరా హార్డింగ్స్, ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన స్పాన్సర్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, కవిత, ప్రసన్న కుమార్, అంబికా కంపెనీ అధినేత, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా..

నటరత్న, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాధారణంగా దివ్వెలో నూనె పోసి అగ్గిపెట్టెతో దానిని వెలిగిస్తాం. కానీ ఎన్టీఆర్ మాత్రం తన వాగ్దాటితో మాట్లాడుతుంటే.. ఉప్పొంగి ... ఆ వత్తి దానంతంట వెలిగిపోయింది. ఇంకో రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద మరో రామారావు ఉండరు అని అన్నారు.

రామారావు గానీ, నాగేశ్వరరావు గానీ, కృష్ణ గారు గానీ, శోభన్ బాబు గానీ ఇప్పటి వరకు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకొన్నారో చెప్పలేదు. ఎవరికి ఎంత ఇచ్చారనే విషయం ఎవరికైనా తెలుసా? నిజానికి ఒకరు మైక్ పట్టుకొని రోజుకు రెండు కోట్లు తీసుకొంటాను. ఆరు కోట్లు తీసుకొంటాను. 40 రోజులకు 80 కోట్లు తీసుకొంటానని చెబుతుంటాడు అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కోట శ్రీనివాస రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రెమ్యునరేషన్ ఎంత తీసుకొంటామనేది చెప్పడం మంచి పద్దతి కాదు. ఆ రోజుల్లో ఎన్టీరామారావు 67 ఏళ్ల వయసులో శ్రీదేవి నటిస్తుంటే.. ఆయన వయసు ఎవరికి తెలియదు. రామారావు, శ్రీదేవీ బాగా చేశారని చెప్పుకొనే వారు. ముసలాయన చేశాడని ఎవరు అనలేదు. నేను ఇప్పుడు నటిస్తే.. ముసలాయన నటిస్తున్నాడు అంటారు. కాబట్టి ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయన ఎంత తీసుకొన్నారనే విషయం బయటకు చెప్పలేదు అని కోట శ్రీనివాసరావు అన్నారు.

Kota Srinivasa Rao controversial comments on Pawan Kalyans remuneration and NTR

ఇదిలా ఉండగా, కొద్దికాలంగా మెగా హీరోలపై కోటా శ్రీనివాసరావు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మా ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో కోట మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏదైనా సభలో పాల్గొంటే నాగబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకు పడుతున్నారు. తాజాగా కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి.

ఇటీవల జనసేన పార్టీ సభలో వైసీపీ నేతల విమర్శలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందిస్తూ.. నేను ఎవరి వద్ద నుంచి ప్యాకేజీ తీసుకోవాల్సిన పనిలేదు. నేను రోజుకు 2 కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నాను. ఒక సినిమాకు 40 రోజులు పనిచేస్తే..80 కోట్ల రూపాయల పారితోషికం పుచ్చుకొంటున్నాను. ఇంకోసారి నేను ప్యాకేజ్ తీసుకొంటున్నానని అంటే.. చెప్పుతో కొడుతాను అని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X