twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్ని, చిరు, బ్రహ్మానందంఅవార్డ్ పంక్షన్ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : హైదరాబాద్‌ రవీంద్రభారతిలో డా||అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకి స్వర్ణ కంకణం తొడిగి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

    ''ప్రజా జీవితంలోకి వస్తే ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని మావయ్య అల్లు రామలింగయ్య చెప్పేవారు. ఇవాళ ఆయన ఉండుంటే మంత్రి స్థానంలో నన్ను చూసుకొని ఎంతగా సంతోషించేవారో'' అన్నారు కేంద్ర పర్యాటక శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి చిరంజీవి.

    అల్లు రామలింగయ్య మహానటుడే కాదు గొప్ప దేశభక్తుడని చిరంజీవి అన్నారు. ... గొప్ప గాంధేయవాది, పరమహంసకు ఆధ్యాత్మిక శిష్యుడు అల్లు. నిజ జీవితంలో పెద్ద డాక్టర్ అని కొనియాడారు. నటునిగా నాకు ఆయన గొప్ప స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు.

    ఈ వేడక విశేషాలు..స్లైడ్ షో లో...

    రవీంధ్రభారతిలో...

    రవీంధ్రభారతిలో...

    సోమవారం హైదరాబాద్‌లో పద్మశ్రీ అల్లు రామలింగయ్య 92వ జన్మదిన సందర్భంగా సారిపల్లి కొండలరావు సారధ్యంలో పద్మశ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార ప్రదానోత్సవం - 2013 జరిగింది.

    స్వర్ణకంకణం తొడిగి...

    స్వర్ణకంకణం తొడిగి...

    అనంతరం అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారంలో భాగంగా కోట శ్రీనివాసరావుకు చిరంజీవి స్వర్ణకంకణం తొడిగారు.

    తలపాగా తొడిగి...

    తలపాగా తొడిగి...

    కోట శ్రీనివాస రావు కి.... మంత్రి కాసు శాలువతో సత్కరించగా, బ్రహ్మానందం తలపాగా తొడిగారు. కోటకు ,బ్రహ్మానందంకు మధ్య మంచి స్నేహం ఉంది.

     అల్లు అరవింద్...

    అల్లు అరవింద్...

    అవార్డును మండలి, ప్రశంసాపత్రాన్ని అల్లు అరవింద్ అందజేశారు. తన తండ్రి ని ఈ రకంగా స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

    చిరంజీవి మాట్లాడుతూ...

    చిరంజీవి మాట్లాడుతూ...

    ''అల్లు రామలింగయ్య లాంటి ఒక గొప్ప నటుడికి అల్లుడిననేదానికంటే, గొప్ప వ్యక్తిత్వమున్న మనిషికి అల్లుడినయ్యాననే సంతృప్తే నాలో ఎక్కువగా ఉంటుంది. నటుడిగా, ఒక వ్యక్తిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడంలో మావయ్య అల్లు రామలింగయ్యే నాకు స్ఫూర్తి. ఆయన నిబద్ధత కలిగిన నటులు. తన కుమారుడు అల్లు వెంకటేష్‌ పద్దెనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో మరణించినా కూడా నిర్మాతకి నష్టం రాకూడదని సెట్‌కి వెళ్లి నటించి వచ్చిన వ్యక్తి ఆయన'' అన్నారు.

    కోటకి ఇవ్వటంతో...

    కోటకి ఇవ్వటంతో...

    ''ఒక్క నటుడిగానే కాకుండా... ఆయనలో ఎన్నో పార్శ్వాలున్నాయి. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లి వచ్చారు. నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి వేల పాత్రలు పోషించారు. సినీ చరిత్రలో ఓ అధ్యాయం అల్లు. ఆయన పేరుతో ఏర్పాటైన జాతీయ పురస్కారాన్ని కోట శ్రీనివాసరావుకి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. పురస్కార గౌరవం పెరిగింది. కోట శ్రీనివాసరావు భాషపై పట్టున్న గొప్ప నటుడు. ఎలాంటి మాండలికాన్నైనా పలుకుతూ పాత్రలను రక్తికట్టించగలరు. ఆయన, నేను ఒకే సినిమాతో తెరప్రవేశం చేశాం. కోట పద్మశ్రీ పురస్కారానికి అన్నివిధాలా అర్హులు'' అన్నారు.

    కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ...

    కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ...

    ''అల్లు రామలింగయ్యగారితో నాకు చక్కటి అనుబంధం ఉంది. ఆయన పేరుతో ఏర్పాటైన పురస్కారాన్ని అందుకోవడం అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తోంది. ఒక బిడ్డ తల్లి ఒడిలో సేదతీరుతున్నట్టుగా ఉంది'' అన్నారు.

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...

    ''భయం, నవ్వు, ఏడుపు ఇలా అన్ని రకాల భావోద్వేగాలను పలికించగల నటుడు కోట. తాతగారిలోనూ, కోటగారిలోనూ నేను ఒక విషయాన్ని గమనించాను. నటులుగా ఎంతస్థాయికి ఎదిగినా... దర్శకుడు కనిపించగానే 'నాకు వేషం మరిచిపోవద్దు' అనేవారు. ఆయనకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉంద''న్నారు.

    బ్రహ్మానందం మాట్లాడుతూ....

    బ్రహ్మానందం మాట్లాడుతూ....

    ''అల్లు వారి పేరు వినిపించగానే ఓ హాస్యనటుడిగా నా ఒళ్లు పులకరించిపోతుంటుంది. ఆయన ఇంట్లోకి వెళ్లి ఎన్నో మార్లు మాట్లాడేవాణ్ని. ఆయన జోకులతో పాటు జీవితం లోతుల గురించి కూడా చెప్పేవారు. నటుడిగా ఆయన దగ్గర్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను. ముప్పయ్యేళ్లుగా నటిస్తూ ఎన్నో గొప్ప పాత్రలకి ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు. తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఆయనకి ఈ పురస్కారం దక్కడం అభినందనీయం'' అన్నారు.

    పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...

    పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...

    ''గొప్ప దేశభక్తుడు అల్లు రామలింగయ్య. ఆయన బతికుండుంటే ఈపాటికే చిరంజీవిగారితో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాని తీసేవాళ్లం. ఆయనకి కథ చెప్పి ఈ సినిమాని ఒప్పించేవాళ్లం. కోట గారు తెలుగు సినిమాల్లో తెలుగువాళ్లే నటించాలని పోరాటం చేస్తుంటార''న్నారు.

    రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ...

    రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ...

    చిరంజీవికి సామాజిక-రాజకీయ స్ఫూర్తి ఇచ్చింది అల్లు రామలింగయ్య అని తెలిపారు. తెలుగు మాండలికాలకు ప్రాధాన్యత తెచ్చింది కోట శ్రీనివాసరావు అని చెప్పారు. అల్లు రామలింగయ్యగారు తెలుగు జాతికోసం, భాష కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అన్నారు .

    మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ...

    మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ...

    సమాజంలో చెడును తీసేసే రంగం సినిమా రంగమన్నారు. మరికొంతమంది నటులకు పద్మశ్రీ పురస్కారాలు రావల్సి ఉందని తెలిపారు.

    తనికెళ్ల భరణి మాట్లాడుతూ...

    తనికెళ్ల భరణి మాట్లాడుతూ...

    అల్లు గొప్ప నటుడని తనికెళ్ల భరణి అన్నారు. చిన్న కుమారుడు చనిపోయిన సమయంలో గుండెల్లో బాధను అదుముకొని నటించిన కార్యదక్షకుడు అల్లు అని చెప్పారు. అంతటి గొప్ప నటుడి పేరు మీద అదే స్థాయిలో పేరున్న పెద్ద నటుడు కోట శ్రీనివాసరావుకు పురస్కారాన్ని ప్రదానం చేయటం ముదావాహం అని తెలిపారు.

    తాతయ్యకే చెల్లింది

    తాతయ్యకే చెల్లింది

    భయపెడుతూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ నటించటం తాతయ్యకే చెల్లిందని తెలిపారు. అల్లు రామలింగయ్య అంటే వళ్లంతా పులకరించే ఆనందం అని అల్లు అర్జున్ మాట్లాడుతూ... తెలిపారు.

    ఈ కార్యక్రమంలో....

    ఈ కార్యక్రమంలో....

    రాష్ట్ర మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, అల్లు అరవింద్‌, సారిపల్లి కొండలరావు, ఎమ్‌.శివప్రసాద్‌, తనికెళ్ల భరణి, ఎల్‌.బి.శ్రీరామ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, కృష్ణుడు, కొండవలస, డా.వెంకటేశ్వరరావు, డా.గోపీచంద్‌, కె.ప్రసాద్‌రెడ్డి, కోట శంకర్రావు, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు

    English summary
    The Union Tourism Minister Chiranjeevi presented golden Kankanam to senior and famous actor Kota Srinivasa Rao as part of the felicitations from Allu Ramalingaiah Kalapeetham on the occasion of awarding him National Award in Ravindra Bharathi, Hyderabad on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X