twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణగారు మాట్లాడితే ఆపగలరా? ‘మా’ సాక్షిగా కోట శ్రీనివాసరావు నోరు నొక్కేసే ప్రయత్నం!

    |

    తెలుగు సినిమాల్లో మొదట తెలుగు ఆర్టిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాతే బయటి వారిని తీసుకోవాలంటూ.... ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు 1994 నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఆయన తన వాయిస్ వినిపించీ వినిపించీ వృద్ధుడైపోయారే తప్ప... ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అప్పటికీ ఇప్పటికీ బయటి ఇండస్ట్రీ నటీనటులకు ప్రధాన్యత పెరిగిందే తప్ప తగ్గలేదు. చాలామంది తెలుగు నటులు అవకాశాలు లేక రోడ్డున పడ్డ సందర్భాలు అనేకం.

    ‘మా' సాక్షిగా కోట శ్రీనివాసరావు నోరు నొక్కేసే ప్రయత్నం!

    ‘మా' సాక్షిగా కోట శ్రీనివాసరావు నోరు నొక్కేసే ప్రయత్నం!

    మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కమిటీ శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోట శ్రీనివాసరావు మరోసారి తన గళం వినిపించారు. అయితే ‘మా' కొత్త అధ్యక్షుడు నరేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకార ముహూర్థం దగ్గర పడుతుంది, మీ ప్రసంగం ఆపండి అనే విధంగా ప్రవర్తించారు. దీంతో కోట శ్రీనివాసరావు సభా ముఖంగా వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

    కృష్ణగారు మాట్లాడుతుంటే ముగించు అని అనగలరా?

    కృష్ణగారు మాట్లాడుతుంటే ముగించు అని అనగలరా?

    ముహూర్తం టైమ్ అవుతోందట. ఎక్కువ మాట్లాడుతున్నానని నరేష్ గారు అభ్యంతరం తెలుపుతున్నారు. తెలుగు వారి గురించి చెబుతున్నాను కదా... ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే ముగించు ముగించు అని బలవంతపెడుతున్నారు. అదే కృష్ణగారు మాట్లాడుతుంటే ముగించు అని అనగలరా?... అంటూ కోట ప్రశ్నించారు.

    వాళ్లకు లక్షలు, మనకు తినడానికి లేక పెన్షనా?, అతడు నటుడా? ‘మా' ప్రమాణ స్వీకారోత్సవంలో కోటా సంచలనం!వాళ్లకు లక్షలు, మనకు తినడానికి లేక పెన్షనా?, అతడు నటుడా? ‘మా' ప్రమాణ స్వీకారోత్సవంలో కోటా సంచలనం!

    నా బాధ మీకు అర్థమైందనుకుంటున్నాను, నన్ను క్షమించండి

    నా బాధ మీకు అర్థమైందనుకుంటున్నాను, నన్ను క్షమించండి

    సరే నేను మాట్లాడను. నా బాధ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక ఏమీ చెప్పదలుచుకోలేదు. నా పొరపాటును క్షమించాలి, తెలుగువారి గురించి ఎక్కువగా మాట్లాడితే ఇంతే. రైట్ సర్.. మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చక్కగా చిరకాలం కళకళలాడుతూ ఉండాలి. ఎక్కువగా మాట్లాడానేమో? కృష్ణగారు, విజయ నిర్మలగారు, కృష్ణం రాజు గారు నన్ను క్షమించండి.. అంటూ కోట వ్యాఖ్యానించారు.

    నిబంధన తీసుకురండి

    నిబంధన తీసుకురండి

    ‘మా' కొత్త కమిటీ అయినా తెలుగు వారి గురించి మాట్లాడండి, తెలుగు వారినే తీసుకోవాలని డిమాండ్ చేయండి. మనది యూనియన్ కాకపోయినా ఇలాంటి ఒక నిబంధన తెస్తే నిర్మాతలు, దర్శకులు పెట్టుకుంటారో? పెట్టుకోరో తర్వాత సంగతి. కనీసం ఆ నిబంధన ఎందుకు పెట్టారు? అని చర్చ వస్తుందని కోట సూచించారు.

    English summary
    Kota Srinivasa Rao Insulted MAA Oath Taking Ceremony. Kota Srinivasa Rao talked about Telugu Artists and Their opportunities. That's why they tried to stop Kota speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X