For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కోటా గాడు వచ్చాడురా అని.. తుక్కుతుక్కుగా కొట్టారు.. ఎన్టీఆర్ కాళ్లకు మొక్కివచ్చా..

  By Rajababu
  |

  తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. నటనకు నిలువెత్తు రూపంగా వెండితెరపై నిలిచారు. హిందీ, తెలుగు, తమిళ సినిమాలో ఆయన పోషించిన పాత్రలకు అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అవార్డులతోపాటు అనేక రివార్డులను అందుకొన్నారు. సర్కార్ సినిమాలో ఆయన నటనను చూసి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రశంసలతో ముంచెత్తారు. నటుడిగా కోటాకు అరుదైన గౌరవంతోపాటు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలను ఆయన పంచుకొన్నారు. అవేమింటంటే..

   వివాదమైన మండలాధీశుడు

  వివాదమైన మండలాధీశుడు

  రంగస్థలం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్న చేస్తున్న సమయంలో మండలాధీశుడు అనే చిత్రంలో నటించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా నటించారు. అప్పట్లో ఆ చిత్రం అత్యంత వివాదాస్పదమైంది. సినీ, రాజకీయాల్లో ఆ చిత్రం ప్రకంపనలు సృష్టించింది. ఆ సంఘటన తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్నారు.

  Taapsee opens up on Raghavendra Rao controversy
  విజయవాడ స్టేషన్లో దాడి

  విజయవాడ స్టేషన్లో దాడి

  మండలాధీశుడు చిత్రం తర్వాత ఓ సారి విజయవాడ రైల్వేస్టేషన్‌లో కొందరు నన్ను కిందపడేసి విపరీతంగా కొట్టారు. ఆ సినిమా చూసిన వారెవరూ కూడా అంతగా ఫీల్ కాలేదు. కానీ ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా తీశారని తెలిస్తే ఆయన అభిమానులు తట్టుకోవడం కష్టమే కదా అని ఆయన అన్నారు. మండలాధీశుడు చిత్రంలో నటిస్తే అంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు.

  కిందపడేసి తుక్కుతుక్కుగా కొట్టారు..

  కిందపడేసి తుక్కుతుక్కుగా కొట్టారు..

  ఎన్టీఆర్‌ విజయవాడలో ఒక కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో నేను స్టేషన్‌‌లో ఉన్నాను. పెద్దసంఖ్యలో తెలుగుదేశం జెండాలు స్టేషన్లు కనిపించాయి. ఈ సమయంలో వచ్చి ఇరుక్కున్నానే అనుకొంటుండగానే కొందరు నన్ను చూసి గుర్తుపట్టారు. కోటా గాడు వచ్చాడురా అంటూనే మీద పడి దాడిచేసి కొట్టారు అని ఆనాటి ఘటనను గుర్తు చేసుకొన్నారు.

  ఎన్టీఆర్‌ను కించపరచలేదు

  ఎన్టీఆర్‌ను కించపరచలేదు

  మండలాధీశుడు చిత్రంలో ఎన్టీఆర్‌ను కించపరుచలేదు. ఆయన ప్రవర్తనను మాత్రమే సినిమాలో చూపించాము. ఆ కారణంగానే ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు. ఎన్టీఆర్‌ అభిమానులు దానిని జీర్ణించుకోలేక ఆవేశంలో నాపై దాడి చేసి ఉంటారు అని కోటా అన్నారు.

  ఎన్టీఆర్‌తో కలిసి నటించే అదృష్టం రాలేదు

  ఎన్టీఆర్‌తో కలిసి నటించే అదృష్టం రాలేదు

  టాలీవుడ్‌లో గొప్ప నటులతో కలిసి నటించాను. కానీ ఎన్టీఆర్‌తో కలిసి నటించే అదృష్ణం రాలేదు. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు. ఎన్టీఆర్‌తో నటించాలన్న కోరిక తీరకపోవడం బాధిస్తుందని కోటా పేర్కొన్నారు.

  ఎన్టీఆర్ కాళ్లకు మొక్కి వచ్చాను..

  ఎన్టీఆర్ కాళ్లకు మొక్కి వచ్చాను..

  మండలాధీశుడు సినిమా తర్వాత మద్రాస్‌ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్‌ను కలిశాను. బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్‌ చెప్పి ఎన్టీఆర్ వస్తున్నారు. అదే అదను అనుకొని ఆయనకు నమస్కారం పెట్టాను. నా వైపు చాలా సీరియస్‌గా చూశారు. ‘మీరు మంచి నటులు అని విన్నాను బ్రదర్‌. గాడ్‌ బ్లెస్‌ యూ. ఆరోగ్యం జాగ్రత్త. బీ కేర్‌ ఫుల్‌'' అని ఎన్టీఆర్ నా భుజం తట్టారనే విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. వెంటనే వంగి ఆయన కాళ్లకు దండం పెట్టి వచ్చాను

  బాహుబలి ఓకే.. విఠలాచార్య కంటే గొప్పవారా?

  బాహుబలి ఓకే.. విఠలాచార్య కంటే గొప్పవారా?

  బాహుబలి చిత్రం భారీ ఖర్చుతో తీయడం బాగున్నది. అది అందరి వల్ల కాదు. కానీ టెక్నికల్‌గా ఖర్చు పెరిగింది తప్ప సాంకేతికత గొప్పతనం కనిపించలేదు. అలనాటి దర్శకుడు విఠలాచార్య కంటే గొప్పవారా వీళ్లంతా. అప్పట్లో సాంకేతికత చాలా తక్కువగా ఉండేది. అయినా విఠలాచార్య అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. సినీ అభిమానులకు గొప్ప అనుభూతిని పంచారు అని కోటా అభిప్రాయపడ్డారు.

  English summary
  Actor Kota Srinivasa Rao shares his Cinema, Political experiences with a popular telugu media. He remembered the attack made by NTR fans at Vijayawada Railway stations due to Mandaladeeshudu movie. He said he never criticised the NTR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X