twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిచ్చి అనుకుంటున్నారు, పట్టించుకోను: కోట శ్రీనివాసరావు

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగువారిని ప్రోత్సహించాలని నేను మొత్తుకుంటుంటే కొంతమంది నవ్వుకుంటున్నారు. పిచ్చి అని కూడా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. మనవాళ్లను మనం గుర్తించకపోతే ఎలా? పరభాష నుంచి దమ్మున్న నటులను తీసుకొస్తే ఎందుకు తిడతాను? అంటున్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు. ఆయన తాజాగా సాక్షి పేపరుతో మాట్లాడుతూ...పరభాషా నటులను తెలుగుకి తీసుకురావడం పై ఇలా ఆగ్రహం వ్యక్తం చేసారు.

    అలాగే..మీకు దమ్ముంటే నసీరుద్దీన్ షాని, నానా పటేకర్‌ని తీసుకు రండి. నేను అమితాబ్‌బచ్చన్‌తో 'సర్కార్' సినిమాలో కలిసి నటించాను. చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. ఆయన్ను తీసుకొచ్చి చేయించమనండి. ఎందుకు కాదంటాను? ముంబయ్‌లో రోజుకి మూడు నాలుగు వేలు తీసుకుని టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేసేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి లక్షలకు లక్షలు ఇస్తున్నారు. అది అవసరమా? సరే.. ప్రకాష్‌రాజ్‌లాంటివాళ్లంటే ఓకే. అతను ఆర్టిస్టు అని తేల్చి చెప్పారు.

    ఇంకా మాట్లాడుతూ.. నాకింకా కోపం తెప్పించే విషయం ఏంటంటే... రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, యమధర్మరాజు... ఇలాంటి పాత్రలకు మన తెలుగువారి మైండ్‌లో ఒక 'రూపం' ఫిక్స్ అయిపోయింది. రామారావుగారు, రంగారావుగారు, సత్యనారాయణగారు, గుమ్మడిగారిలాంటివాళ్లు ఈ పాత్రలు చేయాలి. కానీ తెలుగువారు ఎవ్వరూ లేనట్టుగా మొన్నీమధ్య ఓ సినిమాలో ఒక ముంబై యాక్టర్‌కి యముడి పాత్ర ఇచ్చారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు అన్నారు.

    అయినా అసలు తెలుగువాళ్లని ప్రోత్సహించమంటే తప్పేంటండి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. తెలుగు సినిమాల్లో నూటికి నూరు శాతం తెలుగు నటీనటులు, కళాకారులు ఉంటేనే రాయితీ ఇస్తాం, నంది అవార్డులు కూడా అప్పుడే లభ్యం అవుతాయని ఓ జీవో పాస్ చేయమని ప్రభుత్వాన్ని కోరాలనుకుంటున్నాను అని తన ఆవేదన వ్యక్తం చేసారు.

    English summary
    Telugu actor Kota Srinivas Rao lashed out at Telugu film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X