twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిట్టాలి అన్నంత కోపం వస్తోంది, ఇంతకంటే ఏం చేయాలి?... కోట శ్రీనివాసరావు ఫైర్

    ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలపై ఫైర్ అయ్యారు. తాను బాగానే ఉన్నానని, ఇలాంటి వార్తలు తన కుటుంబాన్ని బాధ పెడుతున్నాయని తెలిపారు.

    By Bojja Kumar
    |

    ఈ మధ్య సోషల్ మీడియాలో, వాట్సాఫ్‌లో ప్రముఖ సెలబ్రిటీల మీద హెల్త్‌కు సంబంధించి చాలా దారుణమైన రూమర్స్ ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ గాయని పి.సుశీల గురించి కూడా డెత్ హాక్స్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు మీద ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    ఈ వార్తలతో ఆగ్రహానికి గురైన కోట శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బాధ్యత గల మీడియా వారు నిజా నిజాలు తెలుసుకోకుండా ఏమిటీ రాతలు అంటూ ఫైర్ అయ్యారు.

    ఇలాంటి తగదు

    ఇలాంటి తగదు

    నా దగ్గర వివరణ తీసుకోకుండా కోట శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగోలేదట.... అంటూ వార్తలు రాయడం సరికాదు. ఏదైనా ఉంటే అడగండి చెబుతాను, కానీ అలాంటివి చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్లు రాస్తే ఎలా? అంటూ కోట ఫైర్ అయ్యారు.

    సినిమాలు చేయట్లేదని ఎవడు చెప్పాడు?

    సినిమాలు చేయట్లేదని ఎవడు చెప్పాడు?

    ఆరోగ్యం బాగోలేదట, రెండు నెలల నుండి కోట సినిమాలు చేయడం లేదట? అంటూ టీవీల్లో వేశారు..... ఎవరు మీకు ఈ విషయం చెప్పారు? నాకు వచ్చే పాత్రల గురించి ఆలోచించుకోవద్దా? నేను మనిషిని కాదా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలా ఉంది వాతావణం? ఎలాంటి వేషాలు మనకు సూటవుతాయి అని చూసుకోవద్దా? ఇలా రాయడం తప్పు కదండీ.... అంటూ కోట వ్యాఖ్యానించారు.

    పెద్ద పెద్ద మహానటులకే తప్పలేదు

    పెద్ద పెద్ద మహానటులకే తప్పలేదు

    పెద్ద పెద్ద మహానటులు కూడా ఓ ఏజ్ వచ్చే సరికి హీరోయిజం తగ్గట్లేదా? అది తప్పంటే ఎలా? ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితి జీవితంలో రావడం మామూలే.... అని కోట తెలిపారు.

    ఆసుపత్రికి వెళ్లడమే పాపమా?

    ఆసుపత్రికి వెళ్లడమే పాపమా?

    ఆసుపత్రికి వెళ్లడమే పాపమా? మాకు సమస్యలు ఉండవా, మాకు ఒంటి సమస్యలు, కంటి సమస్యలు రాకూడాదా? మేము మనుషులం కాదా? ఎక్కడకు వెళ్లినా కెమెరాలు పెట్టేయడం, ఏదో వేసేయడం. ఇలా అయితే ఎట్లా? ఇలాంటి వాతావరణంలో ఆర్టిస్టులు ఎలా ఉంటారు? అని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.

    మీకు కావాల్సినన్ని దొరుకుతున్నాయిగా...

    మీకు కావాల్సినన్ని దొరుకుతున్నాయిగా...

    వాతావరణం అసలే గోలగోలగా ఉంది మీ అందరికీ తెలుసు. టీవీ ఛానల్స్, పత్రికల వార్తల కోసం ఆర్టిస్టులు అందరికీ అందుబాటులోనే ఉంటున్నారు. మీకు కావాల్సినన్ని వార్తలు దొరుకుతున్నాయి. అయినా నా గురించిన ఇలాంటి అనవసరమైన వార్తలు రాయడం ఎందుకు. ఒంట్లో బాగోలేదు అనడానికి ఏమిటి కారణం చెప్పండి? నాకు డయబెటీస్ వచ్చింది. అది రావడం తప్పా? 74 ఏళ్లు... ఆలాంటి జబ్జులు ఉండవా?.... అంటూ కోట ప్రశ్నించారు.

    జనరల్ హెల్త్ బావుంది

    జనరల్ హెల్త్ బావుంది

    ఈ రోజు నా జనరల్ హెల్త్ బ్రహ్మాండంగా ఉంది. ఉన్నదల్లా కాళ్ల నొప్పులే. మెట్లు ఎక్కడం, దిగడం కొంచెం ఇబ్బంది. ఎవరైనా నాకు వేషం ఇవ్వడానికి వస్తే నా జనరల్ హెల్త్ బాగానే ఉంది. నడవడం సమస్య లేదు. కానీ గబగబా మెట్లు ఎక్కలేను, దిగలేను అని ముందే చెబుతాను. నా పరిస్థితికి సెట్టయ్యే పాత్ర అయితే చేస్తాను అని ముందే చెబుతాను అని కోట తెలిపారు.

    ఈ ఏజ్ వాడు ఇంతకంటే ఏం చేయాలి?

    ఈ ఏజ్ వాడు ఇంతకంటే ఏం చేయాలి?

    రెండు నెలల క్రితం నుండి చూస్తే నాలుగైదు సినిమాలు చేశాను. డబ్బింగులకు వెలుతున్నాను. ఈ రోజు బాలకృష్ణుడు ఆడియో ఫంక్షన్ ఉంది. రమ్మని అడిగితే వస్తానని చెప్పాను. ఈ ఏజ్ వాడు ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి.... అని కోట ప్రశ్నించారు.

    నేను మొండిగా ఉంటా, కానీ నా ఫ్యామిలీని బాధ పెడుతున్నారు

    నేను మొండిగా ఉంటా, కానీ నా ఫ్యామిలీని బాధ పెడుతున్నారు

    మీ అందరికీ మనవి చేసేది ఒకటే. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తెలియాలి. నేను కూడా ఓ మనిషినే. ఏదో జ్వరాలు, దగ్గులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. 74 ఏళ్ల వయసువాన్ని. ఏదో చిన్నదానికి, పెద్ద దానికి ఇలాంటి ప్రచారం చేస్తుంటే... మీరు నాకు ఏమీ హాని చేయడం లేదు. నేను మొండి ఘటంలా కూర్చుంటాను. కానీ నా బంధవులు, ఫ్యామిలీని బాధ పెడుతున్నారు. అలా చేయడం తప్పండీ. ఆ అర్హత మీకు లేదు. నాకే కాదు... ఏ ఆర్టిస్టుకైనా... ఏదైనా ఉంటే ధైర్యంగా అడగండి, తప్పులేదు. ఏవో పర్సనల్ కారణాలు ఉంటాయి, వాడేదో పాడవుతుంటాడు. అవి కూడా మీ టీవీలో వేస్తే ఏం చేయడం? అని కోట శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

    తిట్టాలనిపించింది

    తిట్టాలనిపించింది

    ప్రస్తుతం బాగానే ఉంది. హాయిగా ఉంది. ప్రతి వాడు టాటా బిర్లాలు కుబేరులు అవ్వరు కదా. భగవంతుడు ఏదో ఇచ్చాడు. ఎవరి దగ్గర చేయి చాచకుండా... వీలైతే పది రూపాయలు ఎవరికైనా సహాయం చేసే పొజిషన్లో ఉన్నాం. ఇలాంటి వార్తలు విని చాలా కోపం వచ్చింది. తిట్టాలనిపించింది. నా మీద సరదాగా జోకులేసినా పెద్దగ్గా పట్టతించుకోను. కానీ ఇలాంటి వార్తలు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులను బాధ పెట్టే వార్తలు వస్తే మాత్రం సహించను అని కోట తెలిపారు.

    అలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు

    అలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు

    ఈ వార్తలు రావడంతో ఉదయం నుండి అందరూ ఫోన్ చేస్తున్నారు. ఉదయం నుండి ఓ 50 ఫోన్లు వచ్చాయి. అభిమానులు ఉండటం నా అదృష్టం. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సెల్ ఫోన్లలో వాట్సాఫ్ లో వచ్చేవి అస్సలు నమ్మొద్దు అని కోట తెలిపారు.

    English summary
    Kota Srinivasa Rao Personal Interaction With Media About Rumors On His Health.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X