twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్రేడ్ ఫూల్స్‌ని తెస్తున్నారు, వాళ్లకు మేము సహాయకులం.. భగ్గుమన్న కోట శ్రీనివాసరావు!

    |

    రాజకీయ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు ముగిశాయి. అధ్యక్ష పదవికి పోటీ పడిన శివాజీ రాజా, నరేష్ మా మధ్య విభేదాలు లేవంటూనే తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఎన్నికకు వారం ముందు నుంచే హీట్ మొదలైపోయింది. ఆదివారం రోజు మా అసోసియేషన్ ఎన్నిక ముగిసింది. నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ ప్యానల్‌లో పోటీ చేసిన జీవిత, రాజశేఖర్ కూడా విజయం సాధించారు. దీనితో తొలిసారి మా అసోసియేషన్‌కు ఓ మహిళ జనరల్ సెక్రటరీ కాబోతోంది. ఇదిలా ఉండదా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.

    1994 నుంచి ఇదే మాట

    1994 నుంచి ఇదే మాట

    మా అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత కోట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడబోయే అసోసియేషన్ కు ఎలాంటి సూచనలు ఇస్తారు అని ప్రశ్నించగా.. ఎన్నిక పూర్తయ్యాక గెలిచినా వారికి తన సలహాలు ఇస్తానని కోట శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా తెలుగువాళ్ళకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలనే వాదనని మరోమారు వినిపించారు. తాను ఈ విషయం గురించి 1994 నుంచి మాట్లాడుతున్నానని కోట అన్నారు.

    బిగ్రేడ్ ఫూల్స్

    బిగ్రేడ్ ఫూల్స్

    కొన్ని పాత్రలకు అవసరమైతే పరభాషా నటుల్ని ఉపయోగించుకోవచ్చు. అందులో తప్పు లేదు. ఎందుకంటే తాను కూడా ఇతర భాషల్లో పలు చిత్రాలు చేశానని కోట శ్రీనివాసరావు అన్నారు. పరభాషా నటుల్ని తీసుకునివస్తే నానా పాటేకర్ లాంటి గొప్ప ఆర్టిస్టులని తీసుకురావాలి. కానీ బిగ్రేడ్ ఫూల్స్‌ని తీసుకుని వచ్చి వాళ్లకు సహాయకులుగా మమ్మలి నటించమంటే ఎలా అని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.

    లక్షల్లో రెమ్యునరేషన్

    లక్షల్లో రెమ్యునరేషన్

    అసలు ఎందుకు పనికిరాని ఆర్టిస్టులని కీలక మైన పాత్రల్లో నటింపజేయడం.. వారికి లక్షలకు లక్షలు దారపోయడం ఎందుకు అని కోట అన్నారు. కొత్తగా ఎన్నికయ్యే అసోసియేషన్ సభ్యులు దీనిపై దృష్టిపెట్టాలని కోట అన్నారు. ఈ కీలకమైన సమస్యపై ద్రుష్టి పెట్టకుండా ఏవేవో పథకాలు చేస్తాం అని చెప్పడం వృధా అని కోట శ్రీనివాసరావు అభిప్రాయ పడ్డారు. సందర్భం వచ్చినప్పుడల్లా కోట శ్రీనివాసరావు తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించాలని అడుగుతున్నారు.

    కొత్త అధ్యక్షుడిగా

    కొత్త అధ్యక్షుడిగా

    మా అసోసియేషన్ ఎన్నికలో విజయం సాధించిన నరేష్ కొత్త అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించబోతున్నారు. నరేష్ ప్యానల్ శివాజీ రాజా ప్యానల్ పై 69 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత, ట్రెజరర్ గా రాజీవ్ కనకాల ఎన్నికయ్యారు. తాను ఈ ఒక్క టర్మ్ మాత్రమే అధ్యక్షుడిగా ఉంటానని నరేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Kota Srinivasa rao sensational comments on non Telugu actors
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X