'జనతా గ్యారేజ్' పై కోట షాకింగ్ కామెంట్స్, అంతటా ఇదే టాపిక్
హైదరాబాద్ : యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్'. సెప్టెంబర్ 1న సినిమా రిలీజైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కలెక్షన్స్ కుంభవృష్టి కురిపిస్తోంది. అయితే ఈ చిత్రం సక్సెస్ ప్రక్కన పెడితే తెలుగు నటీనటులుకు అవకాశాలు ఇవ్వలంటూ కోట శ్రీనివాసరావు మాట్లాడారు.
'తెలుగు సినిమాలో తెలుగోడికే అన్యాయం జరుగుతుంది' ఈ పాయింట్ పై ఎప్పటినుండో తన గళం వినిపిస్తున్నారు వెటరన్ నటుడు కోట శ్రీనివాస్ రావు. ఇప్పుడు మరోసారి తన వాయిస్ వినిపించారు కోట. తాజాగా ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన కోట.. 'జనతా గ్యారేజ్'లో నటించిన మోహన్ లాల్ ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'తాజాగా ఒక సినిమా రిలీజైంది. ఇంతవరకు హీరో గురించి ఎవరూ చెప్పడం వినలేదు. ఆ సినిమాలో మోహన్ లాల్ బాగా వేశాడు అంటున్నారు. అతను గ్రేట్ మలయాళం యాక్టర్. అందులో అనుమానం ఏముంది? కాని అతన్ని పెట్టుకుని సినిమా చేసి.. బాగా చేశాడు అంటే ఎలా? మరి తెలుగువాడు ఏమైపోయాడు?
అది చూపించాక తెలుగువాడు ఎంత యాక్ట్ చేస్తే నీకు ఆనతాడు?" అంటూ ప్రశ్నించారు కోట. "పనైపోతుంది కదా వాళ్ళని పెట్టుకుంటే.. తెలుగోడు భోజనం చేయక్కర్లేదా??" అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు కోట.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకువచ్చిన జనతాగ్యారేజ్ వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్‌చేస్తోంది. జనతాగ్యారేజ్ తొలి రోజే రూ.21కోట్లు వసూళ్లను రాబట్టినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్‌సీస్‌లో కూడా జనతాగ్యారేజ్ తనదైన వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్‌లో నిత్యమీనన్, సమంత, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











