ఖాళీగా ఉండలేక వాళ్ళను వేషాలు అడిగా.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంతే: కోట శ్రీనివాసరావు

నటుడిగా టాలీవుడ్ హిస్టరిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అతికొద్ది మంది నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎలాంటి పాత్ర చేసినా కూడా ఆడియెన్స్ ను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తారు. అయితే గత కొంతకాలంగా కోట సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అందుకు గల కారణాన్ని అలాగే తన హయ్యెస్ట్ రెమ్యునరేషన్ గురించి కూడా చెప్పాడు.

38ఏళ్ళ సినిమా కెరీర్

38ఏళ్ళ సినిమా కెరీర్

38 ఏళ్ళ నుంచి నటుడిగా అనేక రకాల పాత్రలు చేసిన కోట శ్రీనివాసరావు విలన్, కమెడియన్ పాత్రలతో ఎక్కువగా క్రేజ్ అందుకున్నారు. అప్పట్లో కోట లేని సినిమా ఉండేది. నెగిటివ్ పాత్రలతో బిజీగా ఉన్న సమయంలో పాజిటివ్ గా ఉండే ఫీల్ గుడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు.

 నట జీవితాన్ని గుర్తు చేసుకుంటూ..

నట జీవితాన్ని గుర్తు చేసుకుంటూ..

వందలాది సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తన నట జీవితాన్ని గుర్తు చేసికున్నారు. అలాగే ప్రస్తుతం సినిమా వాతావరణంపై నటనకు గ్యాప్ రావడానికి గల కారణాలను కూడా చెప్పారు. అంతేకాకుండా కొంతమంది అగ్ర నటులను దర్శకులను కూడా పర్సనల్ గా కలిసినట్లు చెప్పారు.

 బోర్ కొట్టేసింది.

బోర్ కొట్టేసింది.

కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు చాలా బోర్ కొట్టేసింది.బోర్ కొట్టేసింది. నేను మా ఆవిడా కోడలు మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళం. ఖాళీగా ఉండడం నచ్చలేదు. ఇక పరిస్థితులు అనుకూలించిన అనంతరం మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని అనిపించింది. ఎన్నేళ్లకు పైగా కొనసాగిన నటనకు సడన్ గా బ్రేక్ రావడం నచ్చలేదు.. అని అన్నారు.

పవన్ కళ్యాణ్ ద్వారా ఛాన్స్..

పవన్ కళ్యాణ్ ద్వారా ఛాన్స్..

38 ఏళ్ళ సినిమా కెరీర్ లో ఏనాడు నేను ఎవరిని కూడా అవకాశం కోసం చేయి చాచలేదు. కానీ ఇప్పుడు అడగాల్సి వస్తోంది. పని లేకుండా ఉండడం నచ్చలేదు. అందుకే భరించలేక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ లాంటి వారిని ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని చెప్పాను. పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే ఒక అవకాశం ఇచ్చాడు. క్రిష్ కూడా రమ్మని చెప్పాడు.. అని తెలిపారు.

 హయ్యెస్ట్ రెమ్యునరేషన్

హయ్యెస్ట్ రెమ్యునరేషన్

ఒకనొక సమయంలో రోజుకు నాలుగైదు సినిమాలు చేసుకుంటూ ఉండే కోట శ్రీనివాసరావు డబ్బుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదట. ప్రతి సినిమాకు ఇచ్చినంత తీసుకొని సంతృప్తి చెందానని అన్నారు. ఇక ఇప్పటివరకు చూసుకుంటే కెరీర్ లో వచ్చిన అత్యదిక రెమ్యునరేషన్ కాల్షీట్ కు లక్ష 50వేల రూపాయలు అని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X