జనతా గ్యారేజ్.. కావాలనే కాంట్రవర్సీ చేశారు.. కోట శ్రీనివాసరావు!

టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శ్రీరెడ్డి లేవననెత్తిన తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విషయం అనేక వివాదాలతో పక్కదారి పట్టింది. కాగా ప్రముఖ నటుడు కోటశ్రీనివాసరావు తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోట వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారాయి కూడా.

జనతా గ్యారేజ్ చిత్ర విషయంలో కోట అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోట ఈ విషయం గురించి మాట్లాడారు. తన వ్యాఖ్యలని కావాలనే వివాదం చేసారని కోట వాపోయారు. జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ బాగా చేసారని చాలా మంది చెప్పారు. మోహన్ లాల్ బాగా చేయడం ఏంటి. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని తాను అన్నానని, ఆ మాటలని పట్టుకుని జనతా గ్యారేజ్ చిత్రంపై కోటా సంచలన వ్యాఖ్యలు అంటూ మీడియా వారు వివాదం చేసారని కోట అన్నారు.

Kota Srinivasarao responds on Janatha Garage controversy

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని తాను గత 12 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాని అన్నారు. పరభాషా నటుల్ని తీసుకోవడంలో తప్పులేదని, కానీ నటన అంటే తెలియని వారిని ఇక్కడినుంచే తీసుకుని వచ్చి పెడుతున్నారని అన్నారు. తెలుగు సినిమాకు ఈ దుస్థితి ఏంటని తనకు అనిపిస్తుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X