నాగచైతన్య జోడీ ఆ పిల్లా?

కొత్త బంగారు లోకం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటినుండీ ఆ సినిమాలోని హీరోయిన్ గాశ్వేతా ప్రసాద్ నే ఈ చిత్రంలో ఫిక్స్ చేసారని వినిపిస్తున్నాయి. అందులోనూ కొత్త బంగారు లోకం నిర్మాత దిల్ రాజు సక్సెస్ మీట్ లో ఆమెపై స్పెషల్ కన్సర్న్ చూపటంతో ఈ ఊహలకు రెక్కలొచ్చినట్లయింది. అందులోనూ నాగచైతన్య చిత్రానికీ రాజు నిర్మాత కావటం మరో కారణం. అయితే ప్రెష్ అమ్మాయిని తన కుమారుడు ప్రక్కన చేయిద్దామని ఆలోచిస్తున్ననాగార్జున ఈ ప్రపోజల్ కి ఒప్పుకున్నాడా..ఒప్పుకుంటాడా... అనేది అందరినీ ఆలోచింప చేస్తోంది. ఇక దిల్ రాజు ఎంపిక బాగానే ఉంటుందనీ... లేతగా ఉండే నాగచైతన్య ఫేస్ కి ఆమె అయితేనే బాగుంటుందని ఈ టాపిక్ కి అంతా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
ఇక పూజా కార్యక్రమాలు మాత్రం ఇటీవలే అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ మూడో తేదీ నుంచి హైదరాబాద్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలను పండించేందుకు నాగచైతన్య గుర్రపు స్వారీ, బైక్ ఛేజింగ్‌లను నేర్చుకుంటున్నారని తెలిసింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











