దసరాకి 'కొత్త బంగారు లోకం'

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..ఒక మంచి సినిమా తయారు కావాలంటే మంచి కథ, మంచి బేనరు, టీమ్ కావాలి. అవన్నీ ఈ సినిమాకి అమిరాయి' అన్నారు. అలాగే ఈ సినిమాని కాంపాక్ట్ బడ్జెట్‌లో తీయాలని మొదట అనుకున్నాం. కొత్త వాళ్లతో, సాంకేతిక నిపుణులతో సినిమాని ప్రారంభించి 60 రోజులలో పూర్తి చేయాలనుకున్నాం. అయితే దర్శకుడు కొత్త కనుక సీనియర్ కెమెరామన్ అయితే అతనికి హెల్ప్ అవుతుందని చోటాని బుక్ చేశాం. అలాగే 'హ్యాపీడేస్' చిత్రం పాటలు విని సంగీత దర్శకుడిగా మిక్కీ .జె.మేయర్‌ను, ఆ సినిమాలో హీరో వరుణ్‌సందేశ్‌ని ఎంపిక చేశాం.
కథ డిమాండ్ చేసిన విధంగానే మిగిలిన ఆర్టిస్టులను ఎంపిక చేశాం. సాధారణంగా ప్రతి సినిమాకు షూటింగ్ స్పాట్‌లో ఉండే నేను ఈ చిత్రం షూటింగ్‌కు మాత్రం ఎక్కువగా వెళ్లలేదు. బాధ్యత అంతా చోటా, శ్రీకాంత్‌లకే అప్పచెప్పాను. సినిమా బాగా వచ్చింది. విజయదశమి సందర్భంగా అక్టోబరు 9న విడుదల చేస్తున్నాం.'అన్నారు. ఈ సమావేశంలో సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











