సెక్సీ లుక్ తో కొత్త బంగారం
ఎ..క..డ అంటూ కొత్త బంగారులోకం చిత్రం ద్వారా కుర్రకారు గుండెలకు గేలం వేసిన కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతాబసు ఇప్పుడు సెక్సి గా మారిపోయింది. తాజాగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న రైడ్ చిత్రంలో ఆమె సెక్సీగా కనిపించనుంది. కొత్త బంగారు లోకం లో చక్కగా ఫ్యామిలీ లుక్ తో ఉన్న ఈ అమ్మాయి ఇలా అయిపోవటం వెనక దర్శకుడు రమేష్ వర్మ ఉత్సాహం ప్రోత్సాహం ఉన్నాయంటున్నారు. ఓ బైక్ చుట్టూ తిరిగే ఈ కథలో రెండు జంటలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒకరు పోగొట్టుకున్న బైక్ ని మరొకరు కొనుక్కోవడంతో కథ మలుపుతిరుగుతుంది.
ఇక ఈ చిత్రం ద్వారా తన అందాలు పంచటం ద్వారా శ్వేతాబసు మరిన్ని అవకాశాలు పొందుతుందా..పెద్ద దర్శకుల కళ్ళల్లో పడుతుందా అంటే సందేహమే అంటున్నారు. అయినా గ్లామర్ ఉన్నప్పుడు రూల్స్ పెట్టుకోకుండా చక్కగా చూపటమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆమె ఈ మధ్యన ఇంటర్వూల్లో వెళ్ళడించింది. ఆశపడిందే దక్కింది కాబట్టి పెద్దగా ఫీలవ్వాల్సిన పనేం లేదు.


Click it and Unblock the Notifications











