twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ 'కొత్తజంట' ఆడియో ఎప్పుడంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం ఆడియోని ఈ నెల మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియోని భారీగా,సినీ పెద్దల సమక్షంలో జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆడియో విడుదల తర్వాత పూర్తి ప్రమోషన్ ఏక్టివిటీస్ ప్రారంభించి విడుదల తేదీని ప్రకటించనున్నారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    Kotha Janta Movie Audio Release

    మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు . 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.

    నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. ఈ నెల మూడోవారంలో పాటల్ని విడుదల చేస్తాము. శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు''అన్నారు.

    ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

    English summary
    Allu Sirish's 2nd film in the direction of Maruthi Kotha Janta audio will be relesed in 3rd week of this month. The film produced by Bunny Vass on Geeta Aarts in assoiciation with Allu Aravind. Regina has been paired opposite Sirish for this romantic comedy which looks promising.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X