మోగా రిలీజ్: ‘కొత్త జంట’ ఆడియో డేట్ మారింది

By Bojja Kumar

హైదరాబాద్: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, రెజినాలు జంటగా హ్యాట్రిక దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ చిత్రం ఆడియోను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఆడియో వేడకను ఏప్రిల్ 12కు వాయిదా వేసారు. ఆడియో విడుదల చేసి సమ్మర్ కానుకగా మే 1న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ 'షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. వేగంగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాము. జేబీ మంచి సంగీతం అందించారు. ఏప్రిల్ 5న సినీ ప్రముఖుల, మెగా అభిమానుల సమక్షంలో అత్యంత భారీగా ఆడియో ఆవిష్కరించబోతున్నాం. చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 786' చిత్రంలోని 'అటు అమలాపురం...ఇటు పెద్దాపురం' సాంగ్ రీమిక్స్ చేసారు. ఈ చిత్రానికి ఈ సాంగు హైలెట్‌గా నిలవనుంది. మారుతి ఈ చిత్రాన్ని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. మారుతి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇద్దరు స్వార్థ పరుల మధ్య జరిగే చక్కని ప్రేమకథ తీసుకుని రెండు గంటల ఎంటర్టెన్ చేసాడు. ప్రతి ఒక్కరూ తమని తాము ఈ చిత్రంలో చూసుకునేలా సాధారణ మనుషుల్లోంచి పాత్రలు తెరకెక్కించాడు. పోసాని కృష్ణ మురళి నటన మా చిత్రానికి మరో హైలెట్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు కురిపించే పాత్రని చేసారు' అన్నారు.

Kotta Janta audio launch on 12th April

దర్శకుడు మారుతి మాట్లాడుతూ...'శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్. లవ్, ఎమోషన్, కామెడీ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని ధైర్యంగా చెబుతున్నాను. శిరీష్, రెజీనా మధ్య వచ్చే సీన్స్ అందరికీ ఆకట్టుకుంటాయి. నా గత చిత్రం ప్రేమ కథా చిత్రమ్ కంటే రెండింతలు కామెడీ ఉంటుంది. మే 1న సినిమాను విడుదల చేయడానకి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు. సంగీతం: జేబి, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: రమణ, యాక్షన్: విజయ్, డాన్స్: గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, సమర్పణ: అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, నిర్మాత్: బన్నీ వాసు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X