twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మారుతి ‘కొత్త జంట’ సెన్సార్ పూర్తి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, రెజినాలు జంటగా హ్యాట్రిక దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    దర్శకుడు మారుతి ఈ సినిమా గురించి చెబుతూ...'శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్. లవ్, ఎమోషన్, కామెడీ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని ధైర్యంగా చెబుతున్నాను. శిరీష్, రెజీనా మధ్య వచ్చే సీన్స్ అందరికీ ఆకట్టుకుంటాయి. నా గత చిత్రం ప్రేమ కథా చిత్రమ్ కంటే రెండింతలు కామెడీ ఉంటుంది. మే 1న సినిమాను విడుదల చేయడానకి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

    Kotta Janta gets U/A

    నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ...చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 786' చిత్రంలోని 'అటు అమలాపురం...ఇటు పెద్దాపురం' సాంగ్ రీమిక్స్ చేసారు. ఈ చిత్రానికి ఈ సాంగు హైలెట్‌గా నిలవనుంది. మారుతి ఈ చిత్రాన్ని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. మారుతి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇద్దరు స్వార్థ పరుల మధ్య జరిగే చక్కని ప్రేమకథ తీసుకుని రెండు గంటల ఎంటర్టెన్ చేసాడు. ప్రతి ఒక్కరూ తమని తాము ఈ చిత్రంలో చూసుకునేలా సాధారణ మనుషుల్లోంచి పాత్రలు తెరకెక్కించాడు. పోసాని కృష్ణ మురళి నటన మా చిత్రానికి మరో హైలెట్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు కురిపించే పాత్రని చేసారు' అన్నారు.

    నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు. సంగీతం: జేబి, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: రమణ, యాక్షన్: విజయ్, డాన్స్: గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, సమర్పణ: అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, నిర్మాత్: బన్నీ వాసు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి.

    English summary
    Allu Sirish and Maruthi’s Kotta Janta has finished all censor formalities and obtained an U/A.The movie is now officially set for a May 1st worldwide release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X