Don't Miss!
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
మారుతి ‘కొత్త జంట’ సెన్సార్ పూర్తి
హైదరాబాద్: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, రెజినాలు జంటగా హ్యాట్రిక దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దర్శకుడు మారుతి ఈ సినిమా గురించి చెబుతూ...'శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్. లవ్, ఎమోషన్, కామెడీ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని ధైర్యంగా చెబుతున్నాను. శిరీష్, రెజీనా మధ్య వచ్చే సీన్స్ అందరికీ ఆకట్టుకుంటాయి. నా గత చిత్రం ప్రేమ కథా చిత్రమ్ కంటే రెండింతలు కామెడీ ఉంటుంది. మే 1న సినిమాను విడుదల చేయడానకి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ...చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 786' చిత్రంలోని 'అటు అమలాపురం...ఇటు పెద్దాపురం' సాంగ్ రీమిక్స్ చేసారు. ఈ చిత్రానికి ఈ సాంగు హైలెట్గా నిలవనుంది. మారుతి ఈ చిత్రాన్ని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్గా తెరకెక్కించారు. మారుతి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇద్దరు స్వార్థ పరుల మధ్య జరిగే చక్కని ప్రేమకథ తీసుకుని రెండు గంటల ఎంటర్టెన్ చేసాడు. ప్రతి ఒక్కరూ తమని తాము ఈ చిత్రంలో చూసుకునేలా సాధారణ మనుషుల్లోంచి పాత్రలు తెరకెక్కించాడు. పోసాని కృష్ణ మురళి నటన మా చిత్రానికి మరో హైలెట్గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు కురిపించే పాత్రని చేసారు' అన్నారు.
నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు. సంగీతం: జేబి, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: రమణ, యాక్షన్: విజయ్, డాన్స్: గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, సమర్పణ: అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, నిర్మాత్: బన్నీ వాసు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి.