»   » అభిమాని సంస్మరణ సభలో చరణ్, బన్నీ, నాగబాబు (ఫోటోలు)

అభిమాని సంస్మరణ సభలో చరణ్, బన్నీ, నాగబాబు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో అఖిల కర్నాటక అన్నయ్య చిరంజీవి ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్. వెంకటేష్ యాదవ్, ఆయన సోదరి మృతి చెందిన సంగతి విధితమే. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ రవీంద్రభారతిలో వెంకటేష్ సంస్మరణ సభ ఏర్పాటు చేసారు.

రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పలువురు సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, దర్శకులు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, తమిళనాడు రాష్ట్ర చిరంజీవి యువసేన అధ్యక్షుడు కె.నాగేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రభాకర్ గౌడ్ తదితలు పాల్గొన్నారు.

రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రూ. 6 లక్షల డి.డి మృతుల కుటుంబ సభ్యులకు అందజేసారు.

నాగబాబు

నాగబాబు


నాగబాబు మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న చిరంజీవి అభిమానుల కుటుంబాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

పిల్లల స్థిరపడేలా అండ

పిల్లల స్థిరపడేలా అండ


వెంకటేష్ యాదవ్ పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు చేదోడు వాదోడుగా నిలుస్తామని నాగబాబు హామీ ఇచ్చారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ

రామ్ చరణ్ మాట్లాడుతూ


చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాట్లాడుతూ వెంకటేష్ మృతి అభిమాన సంఘానికి తీరనిలోటని పేర్కొన్నారు.

అల్లు అరవింద్

అల్లు అరవింద్


అల్లు అరవింద్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని చనిపోతే ఇంత స్పందన వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు.

వెంకటేష్ యాదవ్

వెంకటేష్ యాదవ్


బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్‌ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు అక్టోబర్ 30న అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్‌తో పాటు ఆయన సోదరి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

English summary
It is a known news that the President of Karnataka Chiranjeevi Fans, Kotte Venkatesh Yadav passed away in the Volvo Bus Tragedy on 30th of October this year. Meanwhile, a condolence meeting was held on 6th December in memory of Venkatesh Yadav.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu