శ్రీకాంత్, ఛార్మి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు నిర్మిస్తున్న చిత్రానికి 'కౌసల్యా సుప్రజా రామ' అనే టైటిల్ ని ఖరారు చేసారు. అయితే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లోని 'కౌసల్యా సుప్రజా రామ' అనే పదానికి "కౌసల్యా దేవి సత్సంతానమైన రాముడు" అని అర్ధం . కానీ ఈ సినిమాలో కథ ప్రకారం కౌసల్య, సుప్రజ అనే ఇద్దరు అమ్మాయిల మధ్య రాము అనే హీరో నలుగుతూంటాడు. దాంతో తల్లి,కొడుకుల అనురాగాన్ని చెప్పే ఆ వాక్యం ఇలా విచిత్రంగా మారిపోయింది. ఇది అన్నిటినీ కామన్ గా తీసుకునే ఆధునిక వాదులకి ప్రత్యేకంగా యేమీ అనిపించకపోయినా సంస్కృతి, సంప్రదాయం సొసైటీలో ఇంకా ఉండాలని ఆశించేవారిని భాధ కి గురిచేస్తోంది. దాంతో దర్శక, నిర్మాతలు మరో సారి ఈ టైటిల్ విషయమై ఆలోచిస్తే మేలని వారు అంటున్నారు.