twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాంచన’లో నటించడం అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది..

    By Sindhu
    |

    శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్ ప్రై. లిమిలెడ్ పతాకంపై రాఘవ లారెన్స్ , లక్ష్మీరాయ్ ప్రధాన ప్రధాన పాత్రల్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కాంచన". 'ముని" సినిమాకు సీక్వెల్ ఇది. ఈ చిత్రానికి సమర్పణ బెల్లంకొండ గణేష్‌బాబు. దర్శకత్వం రాఘవ లారెన్స్. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ తల్లిగా కోవై సరళ నటించి మెప్పించింది. సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా కోవై సరళ మీడియాతో ఈ చిత్రం అనుభవాలను పంచుకున్నారు.

    ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే… “చాలా కాలం తర్వాత 'కాంచన" సినిమాలో నటించా. ఈ సినిమాలో నా నటనకు ఇంత మంచి పేరు రావడానికి రాఘవ లారెన్స్ కారణం. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. ఇందులో హీరోకి సమానమైన క్యారెక్టర్ నాది. ఒక పాత్ర ఇవ్వాలంటే అది దర్శకుడు, రచయిత మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు సతీలీలావతి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి… సినిమాలకు వచ్చినదానికంటే ఎక్కువగానే నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు నేషనల్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది.

    ఇందులో ప్రతి పాత్ర ఎనర్జిటిక్‌గా ఉంటుంది. లారెన్స్, శరత్‌కుమార్ హిజ్రా పాత్రల్లో ఎంతో చక్కగా నటించి మెప్పించారు. నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం. నేను ఒంటరిగా రూములో అసలు పడుకోను. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాత్రే జరిగింది. ప్రతి రోజూ మూడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. డబ్బింగ్ కూడా అంతే. ఎంతో కష్టపడి పనిచేశా. ఇప్పుడు శ్రమకు తగ్గ ఫలితం లభించింది. ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తోందని ఆమె సంబరపడుతోంది. 'మామూలుగా మాలాంటి ఆర్టిస్టులకి గుర్తింపు తెచ్చే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు కాంచన సినిమా కూడా అలాంటి సినిమానే. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా తర్వాత మళ్లీ అంతటి రేంజ్ లో నాకిది పేరు తెచ్చింది" అంటోంది కోవై సరళ. ప్రస్తుతం హైదరాబాదులో వుండి, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఆమె పాల్గొంటోంది.

    ఈ రోజూ ప్రతి సెంటర్‌లోనూ సినిమా హిట్. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా ఇది. తమిళంలో రెండు రోజుల క్రితమే విడుదలైంది. అక్కడా మంచి హిట్ అయింది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ని ఇప్పటి వరకు చూడలేదు. ఆయనను చూడకుండానే ఆయన సినిమాలో నటించి రెమ్యునరేషన్ తీసుకున్నా. ఒక్కసారి ఫోన్లో మాట్లాడా అంతే. ఇలాంటి నిర్మాతలు సినీ పరిశ్రమకు ఎంతో అవసరం. ఈ సినిమాకు మ్యూజిక్ తమన్ అందించారు. చాలా చిన్న కుర్రాడు. ఎంతో చక్కటి సంగీతం అందించారు. సంగీతానికి లారెన్స్ స్టెప్పులు తోడయ్యాయి. ఆయన ఓ రబ్బరు బొమ్మలా డ్యాన్స్ చేశారు. పార్ట్ త్రీలో నేను నటిస్తానా లేదా అనేది దర్శకుడిని అడగాలి".

    English summary
    Watch an exclusive interview of Actress 'Kovai Sarala' this edition of 'Beach ... Added to queue Kovai sarala - chit chat on 'Kanchana' ...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X