ఎన్నో విమర్శలు గుప్పించారు.. అన్నమయ్య సీక్రెట్స్ చెప్పిన దర్శకేంద్రుడు
దర్శకేంద్రుడిగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు రాఘవేంద్రరావు. సీనియర్ దర్శకుడిగా, తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కుగా ఉండే ఈయన ఎన్నో విలక్షణ కథాంశాలను ప్రేక్షకుల ముందు తెచ్చారు. అయితే ఈ జర్నీలో ఆయన కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చిందట. తాజాగా జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో ఆ విశేషాలను పంచుకున్నారు రాఘవేంద్రరావు.
అప్పుడూ- ఇప్పుడూ అనే తేడా లేకుండా, ఆ తరం- ఈ తరం అనే తారతమ్యం లేకుండా కొన్ని దశాబ్దాలుగా రాఘవేంద్రరావు సినిమాలు అలరిస్తూనే ఉన్నాయి. ఆయన సినిమాల్లో చెప్పుకోదగిన సినిమా 'అన్నమయ్య'. ఈ సినిమాకు ముందు ఆయన చేసిన సినిమాలు వేరు.. 'అన్నమయ్య' సినిమా వేరు. సో.. ఇలాంటి భక్తి రసమైన సినిమా ఎంచుకొని చాలా విమర్శలు ఎదుర్కొన్నారట దర్శకేంద్రుడు.

'అన్నమయ్య' లాంటి భక్తిరస సినిమా తాను చేయలేనని, ఆ సమయంలో తనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయని స్వయంగా రాఘవేంద్రరావు వెల్లడించారు.
నాగార్జున అన్నమయ్య ఏంటి? మీసాలతో అన్నమయ్యగా కనిపించడం ఏంటి? సుమన్ వేంకటేశ్వర స్వామి ఏంటి? రమ్యకృష్ణ భక్తురాలిగా కనిపించడం ఏంటి? ఈ భక్తి చిత్రంలో మోహన్ బాబు ఏంటి? అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారని ఆయన పేర్కొన్నారు.
అయినప్పటికీ 'అన్నమయ్య' సినిమాతో ప్రేక్షకులను మెప్పించగణనే నమ్మకంతో ఈ మూవీ చేశానని రాఘవేంద్రరావు అన్నారు. ఆ సినిమా కథ వినగానే 'ఈ సినిమాకు పేరే కాదు .. డబ్బులు కూడా వస్తాయి' అని అప్పుడే నాగార్జున ఎమోషనల్ గా చెప్పాడని ఆయన తెలిపారు. మొత్తానికి 'అన్నమయ్య' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషాన్నిచిందని రాఘవేంద్రరావు అన్నారు.


Click it and Unblock the Notifications











