సమంతపై రాఘవేంద్ర రావు ఇంట్రెస్ట్.. ఛాన్స్ ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్

Recommended Video

Raghavendra Rao Interesting Comments On Samantha || Filmibeat Telugu

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్టార్ హీరోయిన్ సమంతపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన రాఘవేంద్ర రావు ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లను తనదైన స్టైల్‌లో గ్లామర్ లుక్‌లో చూపిస్తూ ప్రేక్షకులను కనువిందు చేయడంలో దర్శకేంద్రుడిని మించిన డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పుకోవాలి. కాగా తాజాగా అక్కినేని కోడలు సమంతపై రాఘవేంద్ర రావు ఇంట్రెస్ట్ చూపడం ఆసక్తికర అంశంగా మారింది.

 సమంత డిమాండ్.. లైన్‌లో రాఘవేంద్రరావు

సమంత డిమాండ్.. లైన్‌లో రాఘవేంద్రరావు

పెళ్లి తర్వాత మంచి జోష్‌లో సినిమాలు చేస్తూ పోతోంది సమంత. అక్కినేని వారింట అడుగుపెట్టాక ఆమెకు అన్నీ కలిసొస్తున్నాయి. పెళ్లయ్యాక సమంత చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు విలక్షణీయతను చాటడం కారణంగా ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ క్యూలో తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా చేరడం గమనార్హం.

 ఓపెన్ ఆఫర్ ఇచ్చిన దర్శకేంద్రుడు

ఓపెన్ ఆఫర్ ఇచ్చిన దర్శకేంద్రుడు

సమంత తాజా సినిమా ఓ బేబీ చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆమె నటనకు ఫిదా అయ్యారట. సమంత లీడ్ రోల్ పోషించిన 'ఓ బేబీ' సినిమా జులై 5వ తేదీన విడుదల కానున్న సందర్బంగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు యూనిట్ సభ్యులు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకేంద్రుడు వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ సమంతకు తన తదుపరి ప్రాజెక్టులో తీసుకుంటానని వేదికపై ఓపెన్ ఆఫర్ ఇచ్చారు రాఘవేంద్ర రావు.

పిలిచి మరీ అవకాశం.. సామ్ రియాక్షన్

పిలిచి మరీ అవకాశం.. సామ్ రియాక్షన్

దశాబ్దాల కాలంగా పలు సూపర్ హిట్ సినిమాలు రూపొందిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు రాఘవేంద్ర రావు. దర్శకేంద్రుడి సినిమా అంటేనే హీరోయిన్లలో అమితమైన ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఆయనే స్వయంగా ఇప్పుడు స‌మంత‌ పై ఇంట్రెస్ట్ చూపుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దర్శకేంద్రుడు ఇచ్చిన ఈ ఆఫర్ పై సమంత రియాక్షన్ ఎలా ఉంటుంది ఆమె దానిపై చర్చలు ఊపందుకుంటున్నాయి.

ఓ బేబీ సినిమా

ఓ బేబీ సినిమా

ఇక సమంత ఓ సినిమా విషయానికొస్తే.. నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ బేబీ సినిమా రూపొందింది. చిత్రంలో 70 ఏళ్ల యువతిగా, 20 ఏళ్ల పడుచు పిల్లగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో నటించింది అక్కినేని సమంత. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ జూలై 5న ఓ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X