సినీ నటి కే.ఆర్.విజయకు తీవ్ర అస్వస్థత
వెండితెరపై దుర్గా మాత వంటి దేవతలు పాత్రలను పోషించి పేరు తెచ్చుకున్న సినీనటి కే.ఆర్ విజయ అస్వస్థతకు గురుయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు గడిస్తేగానీ ఏ విషయమూ చెప్పలేమన్నారు. ఇక కె.ఆర్ విజయ రీసెంట్ గా తెలుగులో బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం సింహాలో ఆయనకి నాయనమ్మగా నటించారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసారు. అలాగే ఆమె ఎన్టీఆర్, ఎఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి నిన్నటి తరం హీరోల సరసన హీరోయిన్ గా చేసారు. ఆమె కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











