Don't Miss!
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్‌కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్‌లో జస్ట్‌డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
క్రాక్ పనైపోయినట్లే.. మెగా ప్రొడ్యూసర్ షాకింగ్ డిసిషన్.. బాక్సాఫీస్ రికార్డులకు 'ఆహా' బ్రేక్
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే ఎన్నో రోజులకి గాని టివిల్లోకి వచ్చేవి కావు. కానీ మారుతున్న టెక్నాలజీ దృష్ట్యా ఓటీటీ వలన విడుదలైన 20 రోజులకే మొబైల్ ఫోన్లలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలు స్మార్ట్ టీవీలలో కూడా రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ గా మారిపోయాయి. ఇక కొత్త సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు సందడి చేసే ఛాన్స్ దొరకడం లేదు. ఇక మొత్తానికి క్రాక్ పని కూడా అయిపోయినట్లే.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)
బిగెస్ట్ హిట్ సినిమాగా..
మాస్ మహారాజా రవితేజ గత సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఫైనల్ గా క్రాక్ సినిమాతో మాస్ రాజా రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ షేర్స్ అందునున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
30లక్షలకు పైగా షేర్స్..
విడుదల రోజే సినిమా కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట రెండు షోలు క్యాన్సిల్ అయినప్పటికీ ఆ తరువాత నైట్ షోలతోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. 30కోట్లకు పైగా షేర్స్ అందుకోవడంతో మాస్ రాజా కెరీర్ బెస్ట్ హిట్ సినిమాగా క్రాక్ నిలిచింది. ఇప్పటికి కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.
ఓటీటీ రైట్స్ ఎంతంటే..
అయితే ఈ సినిమా విడుదలైన 20రోజులకే ఓటీటీలోకి వస్తుండడం ఆశ్చర్యం. ఆహా యాప్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను 8.20కోట్లకు అందుకున్నట్లు సమాచారం. అసలైతే మొదట ఒక భారీ రేటుకు ఓటీటీలోనే డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు నిర్మాతలు. కానీ దర్శకుడు అలాగే మరికొందరు సినిమాపై నమ్మకంతో థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు వేయిట్ చేయించారు.
డేట్ ఫిక్స్ చేసిన అల్లు అరవింద్
అయితే సినిమా కనీసం 30రోజులైనా థియేటర్స్ లో హ్యాపీగా ఆడకముందే ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దామవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆహా అధినేత మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినిమాను వీలైనంత తొందరగా ఆహాలో విడుదల చేయించాలని అనుకున్నారు. ఇక నిర్మాతలతో చర్చలు జరిపి మొత్తానికి జనవరి 29మా విడుదల చేయిస్తున్నారు. మరి క్రాక్ ఆ లోపు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.