Just In
- 1 hr ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
- 11 hrs ago
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- 12 hrs ago
‘ఉప్పెన’పై అంచనాలు పెంచేస్తోన దేవీ శ్రీ ప్రసాద్.. ఆ సాంగ్ హైలెట్ కానుందట!!
- 12 hrs ago
ఎద అందాలతో వల.. ‘నిధి’ది మామూలు రచ్చ కాదు!!
Don't Miss!
- News
రాష్ట్రంలో వ్యాక్సినేషన్.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్.. కరీంనగర్లో మంత్రి గంగుల
- Sports
ISL 2020 21: చివరలో నెవిల్లె గోల్.. బెంగాల్, కేరళ మ్యాచ్ డ్రా!!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుమ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు.. ఎందుకు పిలిచారంటూ అవినాష్ అసహనం!!
యాంకర్ సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో అయినా సరే సుమ సెటైర్లు వేస్తూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేక, అలా వేదికపై సుమ వేసే పంచ్‌లు చూడక చాలా రోజులే అయింది. అయితే నిన్నటి క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమ ఈజ్ బ్యాక్ అనేలా రచ్చ చేసింది. అందరినీ ఓ ఆట ఆడుకుంది. మరీ ముఖ్యంగా అవినాష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంది. చివరకు స్టేజ్ మీద ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా కౌంటర్లు వేసింది.

చిన్న క్యారెక్టర్..
క్రాక్ సినిమాలో అవినాష్ చిన్న పాత్రను పోషించాడట. ఇదే విషయాన్ని చెబుతూ దర్శకుడికి సారీ కూడా చెప్పేశాడు. స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడవలసిందిగా అవినాష్‌ను సుమ ఆహ్వానించింది. ఈ ఆహ్వానించే క్రమంలో సుమ అవినాష్ ముక్కు మీద కామెంట్ చేసింది. ఇక్కడున్న గాలిని మొత్తం పీల్చేసుకుంటున్నాడని కౌంటర్లు వేసింది.

కరోనాను కూడా పీల్చుకోవాల్సింది..
అవినాష్ ముక్కు గురించి మాట్లాడిన సుమ అదిరిపోయే పంచ్ వేసింది. గాలిని మొత్తాన్ని పీల్చేస్తున్నావ్.. అలాగే ఈ కరోనా మొత్తాన్ని నువ్వే పీల్చుకుంటే మాకు ఈ బాధ తప్పేది కదా అంటూ సెటైర్ వేసింది.దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అవినాష్‌కు మైకు అందించి సుమ పక్కకు జరిగింది.
Krack Pre Release Event Photos

ఏం మాట్లాడాలో తెలియడం లేదు..
స్టేజ్ ఎక్కి మైకు పట్టుకున్న అవినాష్ తన బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండి రావడంతో ఈ మనుషులంతా కొత్తగా అనిపిస్తున్నారు.. ఈ ఫోన్‌లు ఏంటో.. ఈ వాతావరణం ఏంటో అర్థం కావడం లేదు.. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదంట అవినాష్ చెప్పుకొచ్చాడు.

వెళ్లిపో అంటూ..
అవినాష్ అలా అనడంతో.. వెంటనే సుమ అందుకుని ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే వెళ్లిపో అంటూ సెటైర్ వేసింది. దీంతో కంగారు పడ్డ అవినాష్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అలా మధ్యలో వెళ్లిపోయాను క్షమించండి అని డైరెక్టర్‌ను వేడుకున్నాడు.

సినిమా గురించి మాట్లాడాడు..
అవినాష్ అదే ఫ్లోలో అక్కడే కూర్చున్న రవితేజ, అనిల్ రావిపూడి గురించి కూడా మాట్లాడాడు. వెంటనే సుమ అందుకుని అక్కడున్న వారి గురించి నేను మాట్లాడతాను.. నువ్ వేరే ఏదైనా మాట్లాడు సినిమా గురించి చెప్పు అని కౌంటర్ వేసింది. మరి నన్ను ఎందుకు పిలిచారంటూ అవినాష్ కాస్త అసహనానికి లోనైనట్టు కనిపించింది. అలా చివరకు సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడేసి దిగిపోయాడు.