‘క్రాక్’ ట్విట్టర్ రివ్యూ: చాలా కాలం తర్వాత రవితేజ.. సినిమాకు ప్లస్ వాళ్లే.. ఇంతకీ ఎలా ఉందంటే!

దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు సీనియర్ హీరో రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అలరిస్తూ మాస్ మహారాజాగా పేరొందాడు. చాలా కాలం పాటు వరుస విజయాలతో సత్తా చాటిన ఈయన.. ఇటీవల పరాజయాల పరంపరతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'క్రాక్' అనే సినిమా చేశాడు. ఎన్నో అవాంతరాల నడుమ ఈ మూవీ శనివారం సాయంత్రం రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాడా? క్రాక్ ట్విట్టర్ రివ్యూ మీకోసం!

హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జతకట్టారు

హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జతకట్టారు

గత ఏడాది 'డిస్కో రాజా' వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన రవితేజ.. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. శృతీ హాసన్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించారు.

చివరి నిమిషంలో క్రాక్ రిలీజ్‌కు బ్రేకులు

చివరి నిమిషంలో క్రాక్ రిలీజ్‌కు బ్రేకులు

సంక్రాంతి కానుకగా జనవరి 9న అంటే ఈరోజు 'క్రాక్' విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 11 వందల థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉంది. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ.. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఆర్థికపరమైన కారణాల వల్లే సినిమాకు ఈ సమస్య వచ్చింది.

ఫస్ట్ షో నుంచి క్రాక్ సందడి మొదలైంది

ఫస్ట్ షో నుంచి క్రాక్ సందడి మొదలైంది

అమెరికాలో జరగాల్సిన ప్రీమియర్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 'క్రాక్' సినిమా విడుదల కాలేదు. దీంతో ఎక్కడా మార్నింగ్, మ్యాట్నీ షోలు పడలేదు. దీంతో ఈ సినిమాను వాయిదా వేసేస్తారని ప్రచారం జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించుకున్న చిత్ర యూనిట్.. అన్నీ క్లియర్ అయినట్లు ప్రకటించింది. దీంతో శనివారం సాయంత్రం 'క్రాక్' ఫస్ట్ షో పడింది.

ఫ్యాన్స్ కోరిక ఫలించినట్లే ఉందంటున్నారు

ఫ్యాన్స్ కోరిక ఫలించినట్లే ఉందంటున్నారు

సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్నా రవితేజ అభిమానులు మాత్రం థియేటర్లను వదిలి వెళ్లలేదు. షో పడే వరకూ అక్కడే వేచి ఉండి.. చివరికి మూవీని చూశారు. వాళ్లు మాత్రమే కాదు.. సినీ ప్రియులంతా ఈ దీన్ని వీక్షించారు. ఈ నేపథ్యంలో రవితేజకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ ఇదేనని చెబుతున్నారు. సినిమా అదిరిపోయిందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

రవితేజ విశ్వరూపం... డైరెక్టర్ కసి కూడా

రవితేజ విశ్వరూపం... డైరెక్టర్ కసి కూడా

సరైన స్క్రిప్ట్ దొరికితే రవితేజ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది 'క్రాక్' సినిమాతో మరోసారి రుజువైందని అంటున్నారు. మరీ ముఖ్యంగా అతడు పవర్‌ఫుల్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్ ఆహా అనిపించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇక, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న డైరెక్టర్ కసి బాగా కనిపించింది. అదే సినిమాను హిట్ చేసిందంటున్నారు.

అతడే సినిమాకు హైలైట్... కుమ్మేశాడు

అతడే సినిమాకు హైలైట్... కుమ్మేశాడు

'క్రాక్' సినిమాను చూసిన వారందరూ ఎక్కువగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ గురించే మాట్లాడుతున్నారు. పాటలకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చిన అతడు.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీశాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్‌లో కుమ్మి పడేశాడని చెబుతున్నారు. ఈ సినిమా థమన్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

వాళ్లిద్దరి శ్రమ.. ఆయన పెన్ను.. సూపర్

వాళ్లిద్దరి శ్రమ.. ఆయన పెన్ను.. సూపర్

ఇక, ఈ సినిమాలో అందరూ మెచ్చుకుంటోన్న వాటిలో ఫైట్స్ ఒకటి. ఫైట్ మాస్టర్ రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయట. మరీ ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్‌తో పాటు క్లైమాన్స్ యాక్షన్ సీన్ దుమ్ము దులిపేస్తుందని టాక్. అలాగే, సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X