»   » ‘బాహుబలి’ రేంజిలో బాలయ్య వందో మూవీ, బడ్జెట్ వెల్లడించిన క్రిష్

‘బాహుబలి’ రేంజిలో బాలయ్య వందో మూవీ, బడ్జెట్ వెల్లడించిన క్రిష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య 100వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్దురుమ్, కంచె లాంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన క్రిష్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నెక్ట్స్ ఆయన బాలయ్యతో చారిత్రాత్మక చిత్రం చేయబోతున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చరిత్రను తెరపై చూపించబోతున్నారు.

తాజాగా ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న క్రిష్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'ఈ చిత్రం కోసం తొమ్మిదినెలల సమయం పడుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి 'కథ' నన్ను ఎన్నుకుంది. దీన్ని నిర్వర్తించటమే నా కర్తవ్యం. ఈ సినిమాకు యాభై కోట్లు బడ్జెట్‌ అనుకుంటున్నాం' అన్నారు.

'గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చాలామందికి తెలీదు కాబట్టి ఈ కథను డీల్‌ చేయాలంటే పెద్ద చాలెంజ్‌. అదేవిధంగా జనాలకు తెలీకపోవడం వల్ల కూడా అడ్వాంటేజ్‌ ఉంది. అదేంటంటే తెలుసుకోవాలనే కుతూహలం పుడుతుంది కదా. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని విజువల్‌ గ్రాండ్‌గా తెరకెక్కిస్తాను. ఎంతైనా 'బాహుబలి' చిత్రాన్ని చూసిన కళ్లతో నా సినిమాను ప్రేక్షకులు చూడాలి కదా. అందుకే ఆ రేంజిని అందుకునే ప్రయత్నం చేస్తాను. ఇది పక్కా కమర్షియల్‌ మూవీ. ఈ చిత్రంతో బాలయ్య గారు తన అభిమానులకు గొప్ప ట్రీట్‌ ఇవ్వాలని అన్నారు. అది నెరవేరుస్తాను' అని క్రిష్ చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో క్రిష్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు, ఇటీవల బాలయ్యతో కలిసి 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ ఫోటోస్

కారణంకథే

కారణంకథే

బాలయ్య వందో సినిమా చేయటానికి చాలామంది దర్శకులు పోటీపడ్డారు. అయితే అవకాశం నాకే దక్కడానికి కారణం కథే అని క్రిష్ తెలిపారు.

మనోడు...

మనోడు...

గౌతమీపుత్ర శాతకర్ణి అనే గొప్ప వీరుడి కథ అది. గ్రేట్‌ థాట్‌ ఉన్న వ్యక్తి. దేశంలోని అనేక గణరాజ్యాల్ని ఏకతాటిపైకి తెచ్చి ఏకం చేయటానికి ఆయన కంకణం కట్టుకున్న రోజు ఉగాది అయ్యింది. గొప్ప ఆలోచనలే కాదు, గొప్ప మనసున్న ఆ మహాపురుషుడు మన తెలుగువాడే కావటం విశేషం అని క్రిష్ తెలిపారు.

బాలయ్య హ్యాపీ

బాలయ్య హ్యాపీ

ఇలాంటి వ్యక్తి కథను తీసుకెళ్లాక బాలకృష్ణ గారు హ్యాపీగా ఫీలయ్యారు. కథ చెబుతుంటే ఆయన ఎమోషన్‌ అయ్యారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని చేస్తానన్నారు అని క్రిష్ తెలిపారు.

బాలయ్య చేయకుంటే..

బాలయ్య చేయకుంటే..

ఒకవేళ బాలయ్య గారు చేయకుంటే ‘గౌతమీపుత్ర శాతకర్ణి' కథను పక్కనబెట్టే వాడ్ని అని తేల్చి చెప్పారు క్రిష్.

English summary
Krish about Balakrishna's 100th movie 'Gautamiputra Satakarni' and movie budget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu