twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా అమ్మలాంటి ఎందరో కాన్సర్ పేషెంట్స్ కోసం‌: క్రిష్‌

    By Srikanya
    |

    హైదరాబాద్‌:తమకు అవార్డ్ మనీగా వచ్చిన డబ్బుని విరాలంగా ప్రకటించటం అందరి వల్లా కాదు. అయితే కొందరు డబ్బు కన్నా విలువలకు, సమాజానికి ఏదో ఒకటి వెనక్కి ఇవ్వాలన్న ఆలోచనలకు విలువ ఇస్తారు.

    అలాగే ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి కూడా వ్యవహించారు. తన కంచె చిత్రానికి ఆయన జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరగగా క్రిష్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద వచ్చిన డబ్బును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా ఇస్తున్నట్లు క్రిష్‌ వెల్లడించారు.

    తన తల్లితో పాటు ఎందరో క్యాన్సర్‌ బాధితులకు అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నందుకు అవార్డు సొమ్మును ఆ ఆస్పత్రికి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రం విభాగంలో క్రిష్‌ దర్శకత్వం వహించిన 'కంచె' సినిమా అవార్డును సొంతం చేసుకుంది.

    ప్రస్తుతం క్రిష్‌ బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నారు. కంచె, కృష్ణం వందే జగద్గురం, గమ్యం, వేదం లాంటి చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు క్రిష్‌.

    English summary
    Director Krish tweeted, "I'm donating d Natl Awrd prize money to Basavatarakam Indo American Cancer Hosp which treated my mother & many with utmost care n excellence".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X