క్రిష్ సినిమా 'వేదం' స్పెషాలిటీ అదే...

By Srikanya

తొలి చిత్రం గమ్యం తోనే నంది అవార్డుని,ప్రేక్షకుల రివార్డుని సొంతం చేసుకున్న క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి)రెండో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. వేదం టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మల్టిఫుల్ నేరేషన్ స్టైల్ లో కథనం చెప్పనున్నారని తెలుస్తోంది. అంటే ప్రధాన పాత్రలందరూ ఒకరికొకరు సంభందం లేకుండా ఉంటారు. ఎవరి కథ వారిదే. అయితే అందరికీ ఒకటే క్లైమాక్స్ ఉంటుంది. ఈ తరహా కథలు గతంలో హాలీవుడ్ లోనూ, హిందీలోనూ వచ్చాయి. తెలుగు తెరకు మాత్రం కొత్తే. ఈ ప్రయోగం విజయవంత అవుతుందని అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, మనోజ్‌, అనుష్క, మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్..మాస్ కి ప్రతినిధిగా కనపడితే, మనోజ్..రాక్ స్టార్ గా కనువిందు చేయనున్నాడు. ఇక అనూష్క వేశ్యగా కనపడి కథకు కిక్కు ఇవ్వబోతోంది. అర్క మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రిలీజ్ డేట్ చెయ్యాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ త్వరలో మొదలవుతుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు.త్వరలో ఆడియో సైతం రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X