Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'నేనింతే' సియా..క్రిష్ తో
నేనింతేలో రవితేజ ప్రక్కన ఎర్రగా,బొద్దుగా కనపడ్డ అందం గుర్తుందా...అదే సియా. ఆమె ప్రస్తుతం వేదం చిత్రంలో చేస్తోంది. గమ్యంతో హిట్ సాధించిన క్రిష్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆమె ఓ ప్రత్యేకమైన పాత్రలు చేస్తున్నానంటోంది. బొద్దుగా ముద్దుగా ఉండే సియా కొన్ని కిలోల బరువు తగ్గించుకుని నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. ఇదేంటి ఇలా సన్నబడిపోయావు అని అడిగిన వారితో నోరుకట్టుకుని జిమ్ కెళ్తున్నా అందుకే అంటూ రహస్యం విప్పేసింది. అయితే పుట్టినరోజున మాత్రం అటువంటి మొహమాటాలు లేకుండా చక్కగా ఐస్ క్రీమ్ లు, చాకలెట్లు లాగించేసింది. ఇవాళ ప్రీడం అంటూ ఆనందంతో చెప్పింది. ఈ పుట్టిన రోజుని క్రిష్ వంటి గొప్ప దర్శకుడి సినిమాలో వర్క్ చేస్తూ జరుపుకోవటం ఆనందంగా ఉంది..ఆయన నిజంగా ఎమేజింగ్ డైరక్టర్ ..ఎంతో క్లారిటీతో ఉంటారు. సెట్ కి వచ్చే ముందే విపరీతమైన హోమ్ వర్క్ చేసుకుంటారు...అంటూ పొగిడింది. ఇంతకూ ఈ పుట్టినరోజుకు ఆమె వయస్సు కేవలం ఇరవై రెండు వచ్చాయని చెప్పుకొచ్చింది.